లోకేష్‌కు చంద్ర‌బాబు షాక్ త‌ప్ప‌దా..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ ప‌ని చేసినా.. ప‌ర్య‌వ‌సానాలపై ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి మ‌రీ అడుగు ముందుకు వేస్తారు.  ఆయ‌న కొన్ని ముఖ్య విష‌యాల్లో తొంద‌ర‌గా నిర్ణ‌యం తీసుకోలేర‌ని వ్యాఖ్య‌లు వినిపించినా.. దాని వెనుక ఆయ‌న తీసుకునే జాగ్ర‌త్త‌లు దాగి ఉంటాయ‌ని గుర్తుంచుకోవాలి.  చంద్ర‌బాబు సుదీర్ఘ‌ రాజ‌కీయ‌ప్ర‌యాణంలో ఈ వైఖ‌రితో ఆయ‌న మంచి ఫ‌లితాలనే సాధించ‌గ‌లిగార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అత్య‌ధికుల అభిప్రాయం. తాజాగా  లోకేష్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌న్న డిమాండ్  పార్టీ వ‌ర్గాల‌నుంచి గ‌ట్టిగా వ‌చ్చినా చంద్ర‌బాబు అందుకు […]

టీడీపీ అధ్య‌క్షుడికి చంద్ర‌బాబు హ్యాండ్‌

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత కిమిడి క‌ళావెంక‌ట్రావుకు ఎదుర‌వుతున్న వింత‌ ప‌రిస్థితి… బ‌హుశా మ‌రెవ్వ‌రికీ అనుభ‌వంలోకి వ‌చ్చి ఉండ‌దు. పార్టీకి ఆయన అత్యంత విధేయుడు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఏవిధ‌మైన అనుమానాలూ లేవు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో ఆయ‌నా ఒక‌రు. ప్ర‌స్తుతం  క‌ళావెంక‌ట్రావు.. పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడు కూడా. ఇన్ని అర్హ‌త‌లున్నా ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంటూ ఊరిస్తోంది. చంద్ర‌బాబు తాజాగా చేప‌ట్ట‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో […]

ఏపీ టీడీపీ నేత‌ల పూజ‌లు ఎందుకో..!

ఇప్పుడు ఏపీలో ఏ ప్ర‌ముఖ దేవాల‌యంలో చూసినా.. చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే క‌నిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజ‌మే! అయితే, వారు దేవుడి మీద భ‌క్తి ఉండి వెళ్తున్నారా?  లేక వాళ్ల మ‌న‌సులో ఉన్న కోరిక తీర్చ‌మ‌ని అడిగేందుకు వెళ్తున్నారా?  లేక త‌మకున్న ప‌ద‌వీ గండం త‌ప్పించ‌మ‌ని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్క‌ళ్ల‌ది ఒక్కో కోరిక అని చెప్ప‌క త‌ప్ప‌దు. సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే, […]

బాబుపై లోకేష్ అల‌క‌కు రీజ‌న్ ఇదేనా

వార‌స‌త్వ రాజ‌కీయాలు దేశ, రాష్ట్ర రాజకీయ ముఖ‌చిత్రంలో మ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే విలువ‌లకు క‌ట్టుబ‌డిన అతి కొద్దిమంది రాజ‌కీయ నేత‌లు మాత్రం.. ఇలాంటి రాజ‌కీయాల‌ను త‌మ ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌లేద‌న్న‌ది ఈ సంద‌ర్భంగా త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. ఈ విష‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు పేరును ముందుగా చెప్పుకోవాలి. ఆయ‌న త‌న కొడుకుల్లో ఏ ఒక్క‌రికీ పాల‌నా వ్య‌వ‌హారాల్లో ఇసుమంతైనా జోక్యం క‌ల్పించుకునే అవ‌కాశం ఎన్న‌డూ ఇవ్వ‌లేదు. ఒక‌ర‌కంగా ఆయ‌న కుమారులు కూడా అందుకు ఏ […]

జూనియ‌ర్‌ని చంద్ర‌బాబు మ‌ళ్లీ చేర‌దీస్తున్నారా?

ఏపీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కి మధ్య సంబంధం కేవ‌లం ఫ్యామిలీ ప‌రంగానే ప‌రిమితం కాలేదు. పొలిటిక‌ల్‌గా కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంది. నంద‌మూరి వంశంలో చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌బ‌డిన వారిలో, చంద్ర‌బాబు చేర‌దీసిన వారిలో హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణల త‌రం త‌ర్వాత ఒక్క జూనియ‌ర్ మాత్ర‌మే క‌నిపిస్తాడు. అదేవిధంగా జూనియ‌ర్‌కు ఓ మంచి సంబంధం చూసి, ద‌గ్గ‌రుండి వివాహం చేయించిన ఘ‌న‌త అక్ష‌రాలా చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. నార్నేవారి ఇంటి అమ్మాయిని […]

ఇంటిలిజెన్స్ స‌ర్వేతో హ‌డ‌లెత్తుతున్న టీడీపీ!

ఏ విష‌యంపైనైనా వ్య‌క్త‌ల‌పైనైనా స‌ర్వే చేయించే సీఎం చంద్ర‌బాబు ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా కార్య‌చ‌ర‌ణ రూపొందించుకుంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు స‌హా సీఎంగా ఆయ‌న ప‌నితీరుపైనా స‌ర్వే చేయించుకున్నారు. ఆయా రిజ‌ల్ట్స్‌ని బ‌ట్టి ప‌నితీరును మెరుగు ప‌రుచుకుని ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించాల‌ని బాబు ప్లాన్‌. అదే విధంగా త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది?  విజ‌యం సాధిస్తామా లేదా? అనే కోణంలో […]

షాక్‌: పాలిటిక్స్‌లోకి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌

నిజ‌మే! ఘ‌ట‌మ‌నేని వారి ఇంటి చిన్న‌కోడ‌లు మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారట‌! సామాజిక సేవ‌లో బిజీగా ఉన్న న‌మ్ర‌తా త్వ‌ర‌లోనే పాలిటిక్స్‌లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి పాలిటిక్స్ కొత్త‌కావు. సూప‌ర్‌స్టార్ కృష్ణ గ‌తంలో కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తిచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు కూడా. అదేవిధంగా ఆయ‌న సోద‌రుడు, ప్ర‌ముఖ నిర్మాత ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు కూడా కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ […]

బాబు కాపు వ్యూహంపై తెలుగు త‌మ్ముళ్ల‌లో అసంతృప్తి

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తానంటూ 2014 ఎన్నిక‌లకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన హామీ నేప‌థ్యంలో రాష్ట్రంలో ర‌గిలిన ఉద్య‌మాన్ని చ‌ల్లార్చడంలో బాబూ వ్యూహం బెడిసికొడుతోందా? అధినేత వ్యూహంపైనా, ప్ర‌త్యేకంగా కాపుల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండ‌డంపైనా టీడీపీ త‌మ్ముళ్లు ఫీలైపోతున్నారా?  పోనీ ఇంత చేసినా.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో కాపులు టీడీపీ ప‌క్షాన ఉంటార‌ని గ్యారెంటీ ఏంట‌ని త‌మ‌లో తాము చ‌ర్చించుకుంటున్నారా?  బాబు వైఖ‌రిపై కొంద‌రు తెర‌వెనుక విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారా? అంటే ప్ర‌స్తుతం ఔన‌నే తెలుస్తోంది. 2014 […]

తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి

వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద స‌వాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేల‌నో? ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌నో ఉద్దేశించి కాదు! త‌న‌కు తానుగానే రువ్వుకున్న స‌వాల్‌! విష‌యంలోకి వెళ్లిపోతే.. వైకాపా త‌ర‌ఫున 2014లో ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేస‌మ‌యంలో ఆయ‌న కుమార్తె అఖిల ప్రియ త‌న త‌ల్లి  శోభ‌ప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే […]