ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమంపై పెద్ద దెబ్బే వేసింది. దాదాపు ఏకపక్షంగా సాగిన కాల్పుల్లో ఆ రోజు 28 మంది తాజా లెక్కల ప్రకారం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఏపీ సహా దేశ వ్యాప్తంగా అందరూ దృష్టి సారించారు. ఏపీ పోలీసుల ప్రతిభ గొప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు కూడా. అయితే, ఇప్పుడు మాత్రం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే, […]
Tag: TDP
చంద్రబాబు వ్యూహాల్లో పదును తగ్గిందా…?
ఓ చేత్తో పాలనా పగ్గాలను, మరో చేత్తో పార్టీ వ్యవహారాలను సమర్థంగా సమన్వయం చేసుకురావడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రికార్డును తనపేరిట శాశ్వతంగా లిఖించుకున్న టీడీపీ అధినేత మంచి పాలనాదక్షుడిగా దేశవ్యాప్తంగా పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆయన తిరుగులేని రాజకీయ వ్యూహాలు, సామర్థ్యం కారణంగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగువారి ఆరాధ్య నటుడు, సంచలన రాజకీయ విజయాల సారథుడు, సాధకుడు అయిన ఎన్టీఆర్ చేతుల్లోంచి సైతం […]
దేశంలోకి బ్రాహ్మణి ఎంట్రీ తప్పదా?!
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే నేత ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు సీఎం చంద్రబాబే!! ఈ విషయంలో అనుమానించాల్సిన పనేలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఎంతో యాక్టివ్‌గా నడిపించాల్సిన ఈ సమయంలో దాదాపు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఫలితాలతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు! ఏం చేస్తే […]
జగన్ సవాల్‌తో బాబు ఇరుకున పడతాడా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడం, నేతల వరుస వలసలతో బలహీనపడిన తన పార్టీ క్యాడర్‌లో తిరిగి ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ పొలిటికల్ గేమ్‌కు తెర తీయబోతున్నారా… అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానమిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఇటు టీడీపీని, అంటు బీజేపీని ఇరకాటంలో పెట్టడంద్వారా తన రాజకీయ మనుగడకు బాటలు వేసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే […]
చిరును లైన్లో పెడుతున్న చంద్రబాబు
ఏంటి సర్‌ప్రైజింగ్‌గా ఉందా? చిరు ఏంటి? చంద్రబాబు ఆయనను లైన్‌లో పెట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా? పాలిటిక్స్ అంటే అవేగామరి! ఎప్పుడు ఎవరిని దువ్వాలో ఎప్పుడు ఎవరిని రువ్వాలో అనే సబ్జెక్ట్ పాలిటిక్స్‌లో పెద్ద ట్రిక్. రానున్న 2019 ఎన్నికల్లో మరోసారి గెలుపు గుర్రం ఎక్కి ఏపీ పాలనను సుస్థిరం చేసుకోవాలని చంద్రబాబు పక్కా ప్లాన్‌తో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే తన ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వాస్తవానికి టీడీపీలో […]
పేపరు వైకాపా నేతది…భజన బాబుది
గతంలో ఓ వెలుగు వెలిగినా ప్రస్తుతం చిన్నపత్రికల స్థాయికి పడిపోయిన ఓ పత్రికా సంస్థ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే సదరు పత్రికా యజమాని కొంత కాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతంలో ఈయనగారికి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తనయుడికి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందన్నఆశతో ఆపార్టీలో చేరిన సదరు నేత ఆ మేరకు కొడుక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ […]
పవన్ బాటలో జగన్
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే ప్రస్తుతం ఏపీలో బహిరంగ సభల రాజకీయాల వేడి మొదలైనట్టు కనిపిస్తోంది. నిజానికి దీనికి తెరదీసింది మాత్రం.. ఇంకా రాజకీయాల్లో పార్ట్ టైం పాత్రను మాత్రమే పోషిస్తున్న పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. రాజకీయాలపై తన దిశ దశ ఎలా ఉండబోతున్నాయో ప్రజలకు సవివరంగా చెప్పేందుకంటూ ఆయన తిరుపతిలో తొలిసారిగా బహిరంగ సభను నిర్వహించారు. ఆ తరువాత కేంద్రం… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాకినాడలో మరో సభ నిర్వహించారు. […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
ఏపీలో జంపింగ్‌లకు షాక్ తప్పదా
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున షాక్ తగలనుంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన ఆకర్ష్ దెబ్బకి ఒక్కరొక్కరుగా జగన్‌కు ఝలక్ ఇచ్చి మరీ సైకిల్ ఎక్కేశారు. వీరిలో పెద్దతలకాయలు గా భావించిన వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కేబినెట్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైనార్టీ శాఖ మంత్రి పదవి సహా పలువురికి అమాత్య పీఠాలు అప్పగిస్తానని బాబు హామీ ఇచ్చారని […]