చంద్ర‌బాబు – జ‌గ‌న్‌ను మేనేజ్ చేస్తోన్న ” మెగా “

ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వం, దాని విధానాల‌పై విరుచుకుప‌డే జ‌గ‌న్‌.. తాజాగా ఓ విష‌యంలో మాత్రం ఎంతో మౌనాన్ని పాటిస్తున్నారు. అస‌లు ఆ విష‌యం త‌న‌కు తెలీదు అన్న విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యమే స్టేట్‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు విష‌యంలోకి వెళ్లిపోతే.. ఏపీ చేప‌డుతున్న ప్ర‌తి ప‌థ‌కం, ప్ర‌తి ప‌నిపైనా వైకాపా అధినేత జ‌గ‌న్‌.. అండ్ కో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగిపోయింద‌నే ఆరోప‌ణ‌ల‌తో మైకు […]

టీడీపీలోకి మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు వ‌రుస‌గా జంప్ చేస్తున్నా వారిని ఆపే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం దేవుడు క‌రుణిస్తే మ‌రో ఆరు నెల‌ల్లోనో, యేడాదిలోనో సీఎం అవుతాన‌ని మాత్రం చెపుతూ కాలం గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉందంటే తాము సొంతంగా ఎద‌గ‌డం మానేసి, అధికార టీడీపీ మీద వ్య‌తిరేకత పెర‌గ‌క‌పోదా…అదే మాకు క‌లిసొస్తుంద‌న్న స్థితికి దిగ‌జారిపోయింది. ఇప్ప‌టికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ‌రుస‌పెట్టి అధికార పార్టీ […]

చంద్ర‌బాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని

కొడాలి నాని ఈ పేరు చెపితేనే ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో ఒక‌డిగా రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు గుర్తుకు వ‌స్తాడు. కృష్ణా జిల్లా గుడివాడ‌ను ద‌శాబ్దంన్న‌ర‌గా శాసిస్తోన్న నానిది అక్క‌డ ఓన్లీ వ‌న్ మ్యాన్ షో. పార్టీ ఏదైనా..పార్టీ అధికారంలో ఉన్నా లేక‌పోయినా గెలుపు మాత్రం నానీదే. గ‌తంలో టీడీపీ నుంచి రెండుసార్లు, ప్ర‌స్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాని టీడీపీ వ‌ర్గాల‌కు బ‌ద్ధ శ‌త్రువుగా మారాడు. నాని టీడీపీని వీడిన‌ప్పుడు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు చేశారు. అప్ప‌టి […]

వంగ‌వీటిలో ఎన్టీఆర్ రోల్‌పై టీడీపీలో హైటెన్ష‌న్‌

రాంగోపాల్ వ‌ర్మ లేటెస్ట్ మూవీ వంగ‌వీటి రేపు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉన్నా….కృష్ణా – గుంటూరు – ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల్లో మాత్రం మిగిలిన ఏరియాల ప్రేక్ష‌కుల‌ను మించిన ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే వంగ‌వీటి సినిమాపై టీడీపీ వ‌ర్గాల్లో కూడా ఎక్క‌డా లేని ఆస‌క్తి అనేక‌న్నా…హైటెన్ష‌న్ నెల‌కొంది. వంగ‌వీటిలో ఎన్టీఆర్ రోల్‌ను వ‌ర్మ ఎలా డీల్ చేశాడా అన్న‌దానిమీదే టీడీపీ వ‌ర్గాల్లో ఆస‌క్తి ఉంది. వంగ‌వీటి రంగా […]

ఆ ఒక్క స్టెప్‌తో జ‌గ‌న్ చేతిలో చంద్ర‌బాబు బుక్‌

ప్ర‌పంచానికే మేధావిన‌ని, బిల్‌గేట్స్ లాంటి వాళ్ల‌కి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఓ త‌ప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్‌కి! ఇంకేముంది జ‌గ‌న్ ఊరుకుంటాడా? మ‌రింత‌గా రెచ్చిపోయాడు. బాబు చేసిన త‌ప్పును ఎత్తి చూపుతూ.. ప్ర‌పంచంలో ఇలాంటి వ్య‌క్తి ఇంకెవ‌రైనా ఉంటారా? అంటూ జ‌గ‌న్ విరుచుకుప‌డ్డాడు. విష‌యంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం […]

నారాయణ పెత్త‌నంతో టీడీపీ కొంప కొల్లేరేనా..!

ఏపీలో మునిసిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ త‌న జిల్లాల్లో చ‌క్రం తిప్పుతున్నార‌ట‌! ఈ కామెంట్లు గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మునిసిప‌ల్ శాఖ‌తో పాటు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ కీల‌కంగా ఉన్న సీఆర్‌డీఏకి ఉపాధ్య‌క్షుడుగా కూడా నారాయ‌ణ చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే. దీంతో అధికారులు అంద‌రూ ఈయ‌న‌కు జీ హుజూర్ అంటున్నారు. అయితే, ఈ ప‌రిణామం ఇప్పుడు విక‌టిస్తోంద‌ని అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు. ముఖ్యంగా నారాయ‌ణ త‌న సొంత జిల్లా నెల్లూరులో రెచ్చిపోతున్నార‌ని, […]

ఆ విష‌యంలో టీడీపీ సూప‌ర్ హిట్ – వైకాపా అట్ట‌ర్ ప్లాప్‌

రాజ‌కీయ పార్టీ అన్నాక అది ప్రాంతీయ‌మైనా, జాతీయ‌మైనా.. అధినేత‌లు, నేత‌లతోపాటు దిగువ స్థాయిలో జెండా మోసే కార్య‌క‌ర్త‌లూ ఉండాలి! ఈ విష‌యంలో దేశంలోని ఏ పార్టీ విభేదించే అవ‌కాశమే లేదు. వీలు దొరికిన‌ప్పుడల్లా పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేస్తున్నాం అనే మాట‌లు నేత‌ల నుంచి మ‌నకు త‌ర‌చు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప‌రిస్థితిని చూసుకుంటే.. ఏకైక విప‌క్షంగా ఉన్న వైకాపా.. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని నిశ్చ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ […]

టీడీపీలో దేవినేనిని తొక్కేస్తున్నారా..!

రాజ‌కీయ‌ల్లో తొక్కేయ‌డాలు… అణిచేయ‌డాలు.. జూనియ‌ర్ల‌కే కాదు.. సీనియ‌ర్ నేత‌ల‌కూ ఉంటాయ‌ని చెప్ప‌డానికి తానే ఓ ఉదాహ‌ర‌ణ అని ఇటీవల కాంగ్రెస్ నుంచి చంద్ర‌బాబు చెంత‌కు చేరిన విజ‌య‌వాడ సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ నెహ్రూ తెగ ఇదైపోతున్నార‌ట‌!! తాను త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌న‌ని ప‌లుమార్లు చెప్పుకొనే ఆయ‌న‌కు.. కొంద‌రు జూనియ‌ర్లు సెగ పెడుతున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఏదో ఆశించి చేరిన టీడీపీలో ఏదీ నెర‌వేర‌డం లేద‌ని నెహ్రూ త‌న అనుచ‌రుల వాపోతున్నారు. కాంగ్రెస్‌లో […]

టీడీపీలోకి వైకాపా మ‌హిళా ఎమ్మెల్యే జంప్‌!

వైకాపా అధినేత జ‌గ‌న్‌కి షాక్ మీద షాక్ త‌గులుతోందా? వైకాపాలో జంపింగ్‌లకు ఇంకా ఫుల్ స్టాప్ ప‌డ‌లేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది! వైకాపాలో కీల‌కంగా ఉన్న ఓ మ‌హిళా ఎమ్మెల్యే జంపింగ్ బాట ప‌డుతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. వాస్త‌వానికి వైకాపా నుంచి అధికార టీడీపీలోకి జ‌రిగిన జంపింగ్‌లు అంద‌రికీ తెలిసిందే. క్యూ క‌ట్టుకుని మ‌రీ వైకాపా నేత‌లు టీడీపీలోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెల‌ల కింద‌ట జ‌రిగిన ఈ వ‌రుస జంపింగ్‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర […]