కొన్ని రోజులుగా వైసీపీ నేత కాకాని గోవర్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పెద్ద పదవి కట్టబెట్టేందుకు అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు ఈ పదవి కట్టబెట్టడం ద్వారా వారికి కూడా తగినంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అలాగే నెల్లూరులో వైకాపాకి చెక్ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్నారట. దీంతో శాసనమండలి ఛైర్మన్ అభ్యర్థిగా సోమిరెడ్డిని ఎంపిక చేయనున్నట్లు […]
Tag: TDP
చేతులు కాల్చుకున్న కరణం బలరాం
నీకు ఎప్పుడో ఈ ఉపకారం చేశా.. నాకు ఇప్పుడు ఇది చెయ్యి` అనే మాటలు ఎక్కడయినా కుదురుతాయేమో గానీ.. రాజకీయాల్లో మాత్రం కుదరవు! అది కూడా పార్టీ అధినేతతోనే ఇలా అంటే ఏమవుతుంది? అంటే కరణం బలరాంకి ఎదురైన పరిస్థితిలానే ఉంటుంది. ఎందుకంటారా? త‌్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ అవకాశాలను దూరం చేసుకుంటున్నారని తెలుస్తోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో బలరాం కూడా ఉన్నారు. ఫిబ్రవరి 10న […]
కొడుక్కే షాక్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు పదవి కట్టబెడతారని గంపెడాశలు పెట్టుకున్నారు నేతలు! అయితే ఇప్పుడు ఆ ఆశలపై బాబు నీళ్లు చల్లారు. అంతేగాక ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తే పార్టీలో మరింత కీలకంగా వ్యవహరించాలని ఎదురుచూస్తున్న చినబాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. అయితే దీనికి లోకేష్ వ్యవహార శైలే కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొద్దికాలంగా లోకేష్ తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన్ను ఎమ్మెల్సీ పదవికి […]
వాళ్లకు అదిరిపోయే షాక్ ఇచ్చిన చంద్రబాబు
రాజకీయాల్లో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎప్పుడు ఎవరిని బాగా ఉపయోగించుకోవాలో.. ఎప్పుడు వారికి ప్రాధాన్యత తగ్గించాలో తెలుసుకుని ముందుకెళ్లాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న పని కూడా అదే! నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లు కీలకం. అలాగే ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల హవానే కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ ఇన్‌చార్జులకు `పవర్` తగ్గించి కొత్త ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పచెబుతున్నారు. […]
పవన్ ఉద్దానం టూర్‌కు టీడీపీ ఎమ్మెల్యే సాయం
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు పర్యటించిన సంగతి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఏదైనా చేయకపోతే తాను ప్రజా ఉద్యమాన్ని లేవదీసి…దానిని తానే స్వయంగా లీడ్ చేస్తానని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సాయం చేసినట్టు వార్తలు రావడం ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచలనమైంది. ఈ వార్తలు అధికార పార్టీలో పెద్ద కలకలం రేపాయి. […]
లోకేష్‌కు మంత్రి పదవి బాబు అందుకే ఇవ్వట్లేదా
ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబులపై వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా మాటలతో విరుచుకుపడింది. గతానికి భిన్నంగా ఇద్దరు నేతలను క లిపి కుమ్మేసింది. చౌకబారు విమర్శలు పక్కనపెట్టి.. నిఖార్సైన వ్యాఖ్యలతో చించొదిలి పెట్టింది. ఇంతకీ రోజా ఏమందనేగా సందేహం.. అక్కడికే వచ్చేద్దాం. ఏపీ అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే రోజా.. తాజాగా తన మాటలకు మరింత మషాళా అద్ది.. సంచలనం సృష్టించింది. చంద్రబాబుకు లోకేష్ […]
గంటా మంత్రి పదవికి అదే శ్రీరామరక్ష
ప్రభుత్వంలో ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే చాలు ప్రతిపక్ష నేతలు ఇక తమ నోటికి పనిచెబుతారు. అలాగే పేపర్లలోనూ వారికి సంబంధించిన వాటినే ప్రధానంగా ప్రచురిస్తాయి. ఇక టీవీల్లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు ఏపీలో ఒక మంత్రే కేసులో ఇరుక్కుంటే.. ప్రతిపక్షాలు కిక్కురుమనడంలేదు. పత్రికల్లో ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా కనిపించడంలేదు. అయితే ఇందుకు ఆయన కులమే శ్రీరామరక్షగా మారిందని… అందుకే ధైర్యం చేసి ఎవరూ విమర్శలు చేయలేకపోతున్నారని సమాచారం. ఈ […]
తెలంగాణలో కేసీఆర్ టార్గెట్‌గా మహాకూటమి
తెలంగాణలో సీఎం కేసీఆర్ బలమైన రాజకీయ నేతగా మారిపోయారు. ప్రతిపక్షంలో తనను ఢీ కొట్టే నేతలెవరూ లేకుండా చేయడంలో విజయం సాధించారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి రాజకీయ శక్తిగా అవతరించారు. కేసీఆర్‌పై పోరాడేందుకు ప్రతిపక్షాలకు కోదండాస్త్రం అనే ఆయుధం దొరికింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంను ముందుంచి కేసీఆర్‌తో యుద్ధం చేసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఆయన నేతృత్వంలో ఒక మహా కూటమి ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల్లో […]
చంద్రబాబుపై మంత్రులకే ఆశల్లేవా..!
సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పుడు స్వపక్షంలోనే ఆశలు మృగ్యమవుతున్నాయి. మంత్రులు స్థాయిలోనే సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నా.. చాలా మంది మాత్రం తన అనుచరుల వద్ద పంచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బాబు పాత్ర కన్నా.. చినబాబు పాత్ర ఎక్కువైందని కొందరు అంటుంటే.. మరికొందరు మంత్రి వర్గాన్ని బాబు పట్టించుకోవడం లేదని, కేవలం ప్రచారం పైనే దృష్టి పెడుతున్నారని గుసగుసలాడుతున్నారు. ఇదే బాటలో ఐఏఎస్‌లూ ఉన్నారు. […]