ఉత్తరప్రదేశ్ ఎన్నికల విజయం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఇక చంద్రబాబును మోడీ పక్కన పెట్టడం ఖాయమని, మోడీ వద్ద బాబు ప్రాధాన్యం తగ్గిపోతుందనే ప్రచారం జోరుగా వినిపించింది. కానీ అలా అన్నవారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు-మోడీ సాన్నిహిత్యం మళ్లీ చిగురించిందనడానికి ఎన్డీయే పక్షాల సమావేశం నిదర్శనంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో అభ్యర్థి ఎంపికపై మోడీ.. చంద్రబాబు సలహాలు తీసుకోవడం ఆసక్తికరం గా […]
Tag: TDP
హోదా కంటే పునర్విభజనే బాబుకు ఎక్కువా..?
`నియోజకవర్గాల పునర్విభపన ఎప్పుడు చేస్తారు? వీలైనంత త్వరగా దీనిని చేపట్టండి` అంటూ కేంద్ర పెద్దలను కలిసినప్పుడల్లా ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే వారిని సర్దిచెబుతున్నారు. ఆయనకు కుదరకపోతే.. టీడీపీ ఎంపీలతో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిగేలా చూస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు జరిగి తీరాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. హోదా విషయంలో ఇంతట గట్టిగా ప్రయత్నించని ఆయన.. నియోజకవర్గాల పునర్విభజనపై పడుతున్న ఆరాటం చూసి అంతా ఆశ్చర్యపడుతున్నారు. హోదా విషయంలో ఇంతలా […]
ఆ మంత్రి డైరెక్షన్‌లో నారా లోకేష్..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌కు మంత్రి అయ్యేనాటికి రాజకీయ అనుభవం ఎంత అని లెక్క వేసుకుంటే మూడు రోజులే అని చెప్పాలి. లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే మంత్రి అయ్యాడు. అది కూడా ఆయనకు కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ శాఖలు చంద్రబాబు అప్పగించారు. ఇక లోకేశ్‌కు ప్రజలతో అటాచ్‌మెంట్ కూడా లేదు. మరి […]
టీడీపీలో నల్లారి ఫ్యామిలీ కథ అడ్డం తిరుగుతుందా..!
కాలం కలిసి రాకపోతే.. అధికార పార్టీలో ఉన్నా.. ఎవరు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఫలితం మాత్రం శూన్యం! వీరిని చూస్తే జాలి కలగక మానదు! ఇప్పుడు నల్లారి ఫ్యామిలీ వ్యూహాలను గమనిస్తే ఇలాగే అనిపిస్తుంది. రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని నల్లారి సోదరులు తహతహలాడుతున్నారు. సమైక్యాంధ్ర మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీలో చేరినా.. వారికి విజయం సాధించడం మాత్రం అందని ద్రాక్షే అని […]
మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!
ఏపీకి వరప్రదాయిని అని తెలుగు దేశం నాయకులు, సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తామేనని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మరో మెలిక పెట్టింది. ప్రత్యేకహోదా విషయంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోలవరం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ టర్న్ తీసుకుంది. 2019లోగా […]
ఏపీ మునిసిపల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు
ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ సత్తా చాటింది. టీడీపీ జోరుకు విపక్ష వైసీపీ బేజారయ్యింది. కీలక జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో పలు వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఒక్క వార్డులో మినహా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]
టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు..?
తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన.. త్వరలో ఏదో ఒక పార్టీలో చేరిపోతారనే ప్రచారం జోరందుకుంది. ఆ మాటెలా ఉన్నా.. ఆయన తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్ మాత్రం సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అతి త్వరలోనే పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఆయన చేరికకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని […]
నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరికతో మొదలైన విభేదాలు.. ఆయన మరణం తర్వాత కూడా చల్లారడం లేదు. భూమా హఠాన్మరణంతో అక్కడ జరిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలతో తీవ్రంగా నలిగిపోయిన అధినేత చంద్రబాబు.. చివరకు వీటిని సద్దుమణిగేలా చేశారు. ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా శిల్పా వర్గానికి […]
వైసీపీలో సమర్థులకు పదవులు? మరి టీడీపీలో సమర్థులు ఏమైనట్టు బాబు..!
మంత్రి వర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చోటు కల్పించడంపై సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక సరికొత్త లాజిక్‌ను బయటపెట్టారు. దీంతో ఇక వైసీపీ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పారని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారట. పార్టీని ఎంతో కాలంగా నమ్ముకుని ఉన్న సీనియర్లు సమర్థులు లేరా? అనే ప్రశ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించనవారే సమర్థులా? మేము కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో సమర్థులు ఏమైనట్లు […]