దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు నాట అప్రతిహతంగా చక్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ.. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం దెబ్బతో ప్రస్తుతం విలవిలలాడిపోతోంది! ఏపీలోని 13 జిల్లాల్లో అధికారం చేపట్టి చక్రంతిప్పుతున్నా.. అదే తెలంగాణలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశానని, తెలంగాణలో తన ముద్ర శాశ్వతమని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కనీసం కన్నెత్తి […]
Tag: TDP
టీడీపీలో ఈ కులాలకు మొండిచెయ్యేనా..!
అన్ని వర్గాల వారికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ వర్గానికీ అన్యాయం జరగదని సీఎం చంద్రబాబు పదేపదే స్పష్టం చేస్తుంటారు. కానీ ఇది మాటలకే పరిమితమైందనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వంలో బీసీ, దళితులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాలనే ఆయన అక్కున చేర్చుకుంటున్నారని ఆయా వర్గాల నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణలో తమ వర్గాల వారికి అన్యాయం జరిగిందని […]
నంద్యాల టీడీపీ పంచాయితీలో ట్విస్టులే..ట్విస్టులు
దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో మొదలైన సెగలు.. ఇంకా చల్లారడం లేదు. శిల్పా, భూమా వర్గాల మధ్య వివాదం సమసిపోగా.. ఇప్పుడు మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. భూమా నాగిరెడ్డి మరణంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. కొన్నిరోజులుగా పార్టీలో ఉందామా వద్దా అనే మీమాంసలో ఉన్న శిల్పా మోహన్‌రెడ్డికి అధిష్టానం వరుసగా షాకులు ఇస్తోంది. […]
ఎన్టీఆర్ చుట్టూ సమాధానంలేని ప్రశ్నలెన్నో
2009 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకూ అలానే ఉన్నా.. సడన్‌గా ఎలా వచ్చిందో తెలియదు కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్.. పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి రానని చెప్పినా.. మరి ఎన్టీఆర్ పేరు వినిపించడం వెనుక ఏ శక్తులు ఉన్నాయి? ఎందుకు మళ్లీ ఎన్టీఆర్‌ను బురదలోకి లాగాలని […]
రివర్స్ అవుతోన్న టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్
గత యేడాదిన్నర కాలంగా ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ యమ జోరుగా సాగింది. అధికార టీడీపీ విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను విడతల వారీగా తన పార్టీలో చేర్చేసుకుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్‌ల పర్వంలో మొత్తం రెండు విడతల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా లభించాయి. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం మాత్రమే మిగిలిన ఉన్న వేళ […]
చంద్రబాబు – పవన్ – టీవీ9 సీక్రెట్ ఎజెండా..?
ఏపీలో అధికార టీడీపీ, పవన్‌కళ్యాణ్ జనసేన మధ్య ఏదైనా సీక్రెట్ ఎజెండా ఉందా ? ఈ ఎజెండాకు సంబంధించి ఇంటర్నల్‌గా ఏదైనా వర్క్ జరుగుతోందా ? తాజాగా జరుగుతోన్న పరిణామాలు ఈ రెండు పార్టీల సీక్రెట్ ఎజెండాకు సంబంధించిన అనుమానాలను బలపరుస్తున్నాయా ? అంటే అవుననే ఆన్సర్ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్‌కళ్యాణ్ కాటమరాయుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌తో పాటు ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి హాజరయ్యారు. ఈ సభలో రవిప్రకాశ్ మాట్లాడుతూ […]
లోకేశ్ అడిగారు….బాబు ఇచ్చారు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు జరిగినంత సులువుగా ఏ వారసుడి పొలిటికల్ ఎంట్రీ జరగదేమో..? చట్టసభల్లోకి ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ మూడు రోజులకే ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయాడు. వడ్డించే వాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సూత్రం లోకేశ్‌కు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. కేవలం చంద్రబాబు కుమారుడు అన్న ఒక్క అండతోనే లోకేశ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మంత్రి అయిపోయాడు. ఇక కేబినెట్‌లోకి వచ్చిన […]
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: కలువపూడి శివ – ఉండి
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు (కలువపూడి శివ) ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఉండి నుంచి 2009లోను, 2014లోను వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటి ? శివకు అక్కడ ఉన్న అనుకూల, వ్యతిరేకాంశాలేమిటో చూద్దాం. తననియోజకవర్గంలో రైతులు కరెంటు బాధలతో బాధపడుతుంటే మండుటెండలో కంకరరాళ్ల మీదే సబ్‌స్టేషన్ ముందే బైఠాయించాడు. […]
కొత్త మంత్రికి ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ
కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు సరికొత్త సమస్యలు ఆహ్వానిస్తున్నాయి . వేరే పార్టీ నుంచి వచ్చి.. మంత్రి పదవులు పొందిన వారి జిల్లాల్లో వారికి ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు సహాయం అందుతుందోననే చర్చ ఇప్పుడు తీవ్రమైంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఇది నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సుజయ కృష్ణ రంగారావు మంత్రి ఎంపికవగా.. ఆయన ముందు ఇప్పటికే అనేక సమస్యలు సవాలు విసురుతున్నాయి. గతంలో మృణాళిణి.. ఇప్పుడు కృష్ణకు […]