ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని సర్వేలు ఆశ్చర్యకంగానూ, మరికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీలకు ఒక తీపి, ఒక చేదు వార్తను అందించాయి. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్.. అత్యంత పాపులర్ నాయకుడు. వారి తర్వాత ఎవరు అంటే? కేటీఆర్, హరీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ సర్వే ప్రకారం కేసీఆర్ తర్వాత.. అంతటి […]
Tag: TDP
దారుణంగా పడిపోయిన మోదుగుల గ్రాఫ్
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ తరపున నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో గెలిచి లక్‌గా ఎంపీ అయిన మోదుగుల గత ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు కోసం తన సిట్టింగ్ సీటును వదులుకుని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి అవుతానని మూడేళ్లుగా కలలు కంటోన్న మోదుగులకు ప్రక్షాళనలో చంద్రబాబు షాక్ ఇచ్చారు. దీంతో మోదుగుల బాబు అన్నా, టీడీపీ అధిష్టానం అన్నా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ […]
టీడీపీకి మరో ఎంపీ రాజీనామా?
2019 ఎన్నికల సమయానికి ప్రస్తుత టీడీపీ ఎంపీల్లో చాలామంది రాజీనామాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని, ఇందుకోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. అయితే ఇదే పదవి కోసం పోటీపడుతున్న ఎంపీ మురళీమోహన్ కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం! ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరగలేకపోతున్నారు. తన వారసురాలిగా కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ […]
ఆ జిల్లా టీడీపీలో ముదిరిన ముసలం
కంచుకోటలో కుమ్ములాటలు భగ్గుమంటున్నాయి. తెలుగు దేశంల నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఆది నుంచి టీడీపీకి అండగా నిలుస్తున్న అనంతపురం జిల్లాలో కీలక నేతల మధ్య పదవుల పోటీ నెలకొంది. ఎవరికీ వారే తమ వారికి పదవులు దక్కేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తుంది. జిల్లాకు అనేక పదవులను కట్టబెట్టారు సీఎం చంద్రబాబు..ఇప్పుడు ఆ పదవులే పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా […]
చంద్రబాబు నిర్ణయాలే బొత్సకు వరం!
విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో సీఎం పాటించిన కొన్ని సమీకరణాలు.. బొత్స సత్యనారాయణకు వరాలుగా మారుతున్నాయట. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయట. చంద్రబాబు నిర్ణయాలతో 2014 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్.. స్వేచ్ఛ ఇవ్వకవపోవడంతో బొత్స […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై లోకేష్ షాకింగ్ కామెంట్స్
హరికృష్ణ- చంద్రబాబు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే! ఇదేసమయంలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేగాక తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని లోకేష్ వ్యాఖ్యానించడం అటు పార్టీలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీసింది. […]
2019 ఎన్నికల్లో పీతలకు మరోసారి “చింతలపూడి ” టిక్కెట్టు వస్తుందా ? డౌటేనా ?
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో ఈ రోజు టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న మాజీ మంత్రి పీతల సుజాత ప్రోగ్రెస్ ఎలా ఉంది ? ఆమెకు ఉన్న ప్లస్సులు, మైనస్‌లు ఏంటో చూద్దాం. చింతలపూడి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట. గతంలో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. ఇక టీచర్ అయిన పీతల సుజాత […]
ఏపీలో టీడీపీకి 150 – వైసీపీకి 125 – జనసేనకు 55 సీట్లు
వచ్చే సాధారణ ఎన్నికలకు వాస్తవంగా మరో 20 నెలల గడువు ఉంది. అయితే 2018లోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమిలీ ఎన్నికలకు వెళతారని..ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలోను ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అదే జరిగితే 2018లోనే ముందస్తు ఎన్నికలు జరగడం తథ్యం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం కాస్తా రంజుగా మారుతోంది. అధికార టీడీపీ మరోసారి గెలుపుకోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇక […]
టీడీపీ వాళ్లనే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య ఆంతర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకి, మున్సిపల్ చైర్మన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రతి వ్యవహారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా కలహాలు ముదిరిపోయాయి! ప్రతి విషయంలోనూ మంత్రి టీడీపీ నాయకులను టార్గెట్ చేయడాన్ని టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. మిత్ర పక్షమయినా.. విపక్షంలా వ్యవహరిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే గత ఎన్నికల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నికల్లో […]