ఏపీలో వచ్చే ఎన్నికలకు రెండేళ్లు టైం ఉండగా అప్పుడే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు తమ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా తమ పార్టీలోకి రావడంతో ఇది తమ సిట్టింగ్ సీటు అని […]
Tag: TDP
బాబు కొత్త మంత్రులు … ఎవరి ర్యాంకు ఎంత…!
ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం, ఆ ఫలితాలతో ఎప్పటికప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అప్రమత్తం చేస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు! మరి 2019కి ఎలక్షన్ టీమ్‌గా ప్రకటించిన మంత్రివర్గం పనితీరుపై ఇప్పుడు ఆయన సర్వే నిర్వహించారు. పాత, కొత్త మంత్రుల కలయికతో చేపట్టిన కేబినెట్‌కు.. 100 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు.. వారి ప్రతిభ, పనితీరు ఆధారంగా ర్యాంకులు కూడా ప్రకటించారు. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక సీఎం […]
సీనియర్ మంత్రి యనమలకు లోకేశ్ మార్క్ చెక్
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఫ్యూచర్‌లో పార్టీ మీద పట్టుకోసం అప్పుడే చాపకింద నీరులా ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. ఫ్యూచర్‌లో తనకంటూ ఓ కోటరీ ఏర్పాటు చేసుకునే క్రమంలో పావులు కదుపుతోన్న లోకేశ్ సీనియర్ మంత్రులకు వ్యూహాత్మకంగా చెక్‌పెడుతున్నారు. తాజాగా ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి మార్పుతో అక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్న నామన రాంబాబు […]
లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడం బాబుకు పరీక్షే
ఏపీ సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షలా మారాయి. ఆ ఎన్నికల్లో రెండోసారి గెలిచేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తోన్న బాబు ముందు మరో పెద్ద సవాల్ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీని స్టేట్‌లో రెండోసారి గెలిపించడం ఒక ఎత్తు అయితే, తన తనయుడు లోకేశ్ పొలిటికల్ ఫ్యూచర్‌కు సరైన బాట వేయడం రెండో పరీక్ష. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆ టర్మ్‌లో బాబు పూర్తికాలం సీఎంగా ఉంటారన్న […]
ఆనం బ్రదర్స్‌ను బాబు సైడ్ చేసేశారా..!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోదరులు కాంగ్రెస్ పాలనలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఓ రేంజ్‌లో శాసించారు. కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వడంతో పాటు వీరిద్దరు మంత్రులుగా కూడా పనిచేసి జిల్లాను శాసించారు. ఇక గత ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడంతో ఈ సోదరులిద్దరు ఎన్నో ఆశలతో తమ పాతగూడు అయిన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పుడు ఆనం సోదరులు […]
నిన్న తమ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్
అన్న బాటలో తమ్ముడు నడవడం సహజం! కానీ ఇక్కడ తమ్ముడి బాటలో అన్న నడుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్నదే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుకగా అన్నతమ్ముళ్లు ఒక గూటికి చేరబోతున్నారు. కర్నూలులో టీడీపీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగపాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహన్‌రెడ్డి. ఇప్పుడు ఆయన బాటలోనే అన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు టీడీపీ వర్గాల్లో […]
2019 వార్ టీడీపీకి పూలపాన్పు కాదు
నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎం అయ్యేందుకు చంద్రబాబు ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్షానికి పరిమితమైన ఆయన ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది సీనియర్లను వదులుకున్నారు. కొందరు పార్టీలు మారిపోతే, మరి కొందరు రాజకీయాల నుంచి నిష్క్రమించడం లేదా మరణించడం జరిగాయి. 2004లో టీడీపీ చరిత్రలోనే ఘోర పరాజయం చూసింది. 2009లోను ముక్కోణపు పోటీలో మరోసారి వరుసగా ఓడింది. ఇక 2004కు ముందు వరకు చంద్రబాబు పాలన అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు […]
మైలవరంలో ఉమాకు యాంటీ…నియోజకవర్గం మార్పుపై మాస్టర్ ప్లాన్
ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నా ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న మైలవరం నియోజకవర్గంలో మాత్రం మసకబారుతున్నట్టే కనపడుతోంది. ఉమా అంటే ఏపీ స్టేట్ వైజ్‌గాను, కృష్ణా జిల్లాలోను ఓ పొలిటికల్ ఐకాన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఎలా ఉన్నా ఉమా ఇప్పుడు మైలవరంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009, 2014లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో గెలిచి […]
వాటి ముందు బాబు అనుభవం బలాదూర్
క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ అధినేత చంద్రబాబు కూడా పరిష్కరించలేనంత స్థాయిలో అంతర్గత పోరు నడుస్తోంది. రాజకీయంగా బలపేందుకు ప్రతిపక్ష వైసీపీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేసుకున్నారు. అప్పుడు రేగిన అసంతృప్తి జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. వీటిని చల్లార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. వారిని పార్టీ చేర్చుకోవడంలో సూపర్ సక్సెస్ అయిన చంద్రబాబు.. వారి చేరికతో వచ్చిన విభేదాలు, […]