పాలిటిక్స్ అన్నాక ఎత్తులు, పై ఎత్తులు కామన్. అయితే, 2050 వరకు ఏపీలో అధికారంలో ఉండాలని గట్టి నిర్ణయం మీదున్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్లాన్ మాత్రం అదిరిపోతోంది. సాధారణంగా అందరూ లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ, వ్యూహాలు లేక వాటిని సాధించలేక.. చతికిల పడుతుంటారు. కానీ, బాబు అలా కాదు.. 2019 అపై 2024. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆదిశగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు అమలు చేస్తున్న […]
Tag: TDP
నంద్యాల రూరల్ కౌంటింగ్ ఇలా జరిగింది…
తెలుగు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌లో అధికార టీడీపీ దూసుకుపోతోంది. వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న నంద్యాల రూరల్ మండలంలో వైసీపీకి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. వైసీపీకి పట్టున్న నంద్యాల రూరల్ మండలంలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ మొత్తం ఐదు రౌండ్ల కౌంటింగ్ జరగగా అన్ని రౌండ్లలోను టీడీపీకి భారీ మెజార్టీ వచ్చింది.\ నంద్యాల రూరల్ మండలం కౌంటింగ్ ముగిసేసరికి టీడీపీకి 31,062, వైసీపీకి 17,927, కాంగ్రెస్‌కు 278 ఓట్లు […]
నంద్యాలలో 8,9 రౌండ్లలో టీడీపీకి మెజార్టీ ఎందుకు తగ్గింది
నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్‌లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల కౌంటింగ్ అవ్వగా 9 రౌండ్లలోను టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే మెజార్టీ లభించింది. 9 రౌండ్లు ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 18,132 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. వైసీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక 9 రౌండ్లలోను టీడీపీకే మెజార్టీ వచ్చినా పట్టణంలో టీడీపీకి ముందునుంచి భారీ మెజార్టీ వస్తుందని అందరూ […]
నంద్యాల రూరల్‌లో వైసీపీ ఆశ నిరాశే
నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్ నుంచే అధికార టీడీపీ దూసుకుపోతోంది. మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 6 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. నంద్యాల రూరల్ మండలంలోని ఐదు రౌండ్లలో టీడీపీకి ఏకంగా 13135 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. నంద్యాల రూరల్ మండలంతో పాటు గోస్పాడు మండలంపై ముందునుంచి విపక్ష వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ రెండు మండలాల మెజార్టీతో తాము గెలుస్తామని, టౌన్‌లో టీడీపీకి మెజార్టీ వచ్చినా దానిని […]
టీడీపీలోకి వాణీ విశ్వనాథ్… ముహూర్తం ఫిక్స్
ఏపీలో రాజకీయం ఎంత రంజుగా ఉందో చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య వార్ అదిరిపోతోంది. తాజాగా జరుగుతోన్న నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నికలకు ఓ టీజర్‌గా అందరూ అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారు టీడీపీలోకో, వైసీపీలోకో తమ వీలును బట్టి జంప్ చేసేస్తున్నారు. ఇక పార్టీలు కొంతమందిని తమ అవసరం కోసం ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్నిటి తరం సీనియర్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ […]
జగన్‌పై బాబు డైలాగుల బ్రహ్మాస్తం!
తలతన్నేవాడు ఒకడుంటే.. వాడి తాడి తన్నేవాడు మరొకడు ఉంటాడు! అది రాజకీయాలైనా.. మరొకటైనా ఒక్కటే ఫార్ములా. దీనిని తూ.చ. పాటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన అస్త్రాలు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఎదుటివారి మాటలు, వారి చేతలే వారికి బ్రహ్మాస్త్రాలుగా ఉపయోగపడతాయని నిరూపించారు చంద్రబాబు. ముఖ్యంగా జగన్ వంటి.. జుట్టు చేతికి ఇచ్చి.. కాళ్లు గెంతులేసే టైపు వారైతే.. బాబుకి మరీ పండగ! విషయంలో వెళ్తే.. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. […]
మంత్రిగారు బాబును టెన్షన్ పెడుతున్నారు ఎందుకు..!
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దూకుడు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు చిక్కులు తెచ్చి పెడుతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్ అండ్ కో పై తనదైన శైలిలో విరుచుకుపడిన ఆయన.. మంచి మార్కులే కొట్టేశారు. ఈ సమయంలో ఆయన చేస్తున్న ప్రకటనలు.. మాత్రం ఇప్పుడు టీడీపీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో 80శాతానికి పైగా పోలింగ్ నమోదవడంతోనే అంతా ఏమవుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సమయంలో.. సోమిరెడ్డి […]
తలలు పట్టుకుంటున్నాటీడీపీ నేతలు…ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నంద్యాల ఉప ఎన్నిక ఆది నుంచి అంతం వరకు అనేక ట్విస్టులు, ఉత్కంఠలు, కేసుల నమోదు వంటి అనేక అంశాల చుట్టూ తిరిగి.. ఆ నియోజకవర్గాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎల్లుండే ఈ ఎన్నిక ఫలితం వెల్లడి కానుండడంతో మొత్తం ప్రక్రియకు ఆరోజుతో ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక, సోమవారం నాటి లెక్కలపై పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచే బెట్టింగులు మొదలయ్యాయి. మా అభ్యర్థి గెలుస్తాడంటే.. మా వాడే గెలుస్తాడంటూ.. పెద్ద […]
కాకినాడలో టీడీపీకి కష్టాలు
ఏపీలో నెల రోజులుగా జనాల కాన్‌సంట్రేషన్ అంతా నంద్యాల ఉప ఎన్నికమీదే ఉంది. నంద్యాలలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ప్రచారం సాగినా పోలింగ్ ముగిశాక అధికార పార్టీకి కాస్త ఎడ్జ్ ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయి. ఇక నంద్యాల ఫలితం తేలడం ఒక్కటే మిగిలి ఉంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ కార్పొరేషన్‌కు జరుగుతోన్న ఎన్నికలపైనే ఉంది. ఏపీలో ఈ మూడేళ్లలో జరుగుతోన్న మేజర్ […]