చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారు…?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు విడుదల అవుతారు..? సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుంది..? తీర్పు ఎలా వస్తుంది..? ఏం జరగబోతోంది..? ఎక్కడా చూసినా కూడా ఇదే చర్చ. ఈనెల 30 నుంచి సుప్రీంకోర్టు పునఃప్రారంభమవుతోంది. ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు చంద్రబాబు బెయిల్ పిటిషన్ బదిలీ చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా, ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఏం జరగబోతోందనే చర్చ కూడా అందరిలో ప్రారంభమైంది. అసలు చంద్రబాబు ఎప్పుడు విడుదల అవుతారని, కోర్టు తీర్పులు ఏం […]

బాబు ఆరోగ్యం, వయసు… అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

నారా చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పే మాట పని రాక్షసుడు అంటారు. రోజుకు 16 గంటలు పని చేస్తాడని…. ఆయన నవ యువకుడని కూడా గొప్పగా చెప్పుకుంటారు. అయితే తాజాగా ఆయన అరెస్టు తర్వాత అదే టీడీపీ నేతలు చెబుతున్న మాటలు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీకే బూమ్‌ రాంగ్‌గా మారుతున్నాయి. నిన్నటి వరకు చంద్రబాబు పైన సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసేవారు. గంటల గంటల పాటు […]

చంద్రబాబు అరెస్ట్‌… టీడీపీ అనుకూలించలేదా…?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు క్రమంగా మరుగున పడుతున్నట్లుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో భారీ స్కామ్‌ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో… 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో… సుప్రీం కోర్టు గడప తొక్కారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అదే సమయంలో చంద్రబాబుకు […]

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… సోషల్‌ మీడియాలో వైరల్‌…!

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… అంటూ కన్యాశుల్యంలో నాటకంలో గిరీశం చెప్పిన డైలాగు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిజమే… ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, […]

అసలు ఆ ఇద్దరు ఏమయ్యారు… ఎక్కడున్నారు….?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పరిస్థితులు గరంగరంగా మారాయి. నేతల యాత్రలతో బిజీ బిజీగా ఉన్న తరుణంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… విజయవాడ ఏసీబీ కోర్టులో […]

నారా లోకేశ్ ట్వీట్… క్యాడర్‌లో డైలమా…!

ఓ వైపు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. అసలు అవినీతి జరగలేదని పైకి చెబుతున్నప్పటికీ… వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉందనేది పార్టీలో నేతల గుసగుసలు. మేము నిజాయతీ అని పైకి చెబుతున్నప్పటికీ… కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో సగటు కార్యకర్త పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టీడీపీ యువనేత పెట్టిన ఓ ట్వీట్.. అటు పార్టీలో ఇటు క్యాడర్‌లో కూడా […]

చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన సీన్.. గ్రాఫ్ పెరిగిందా….?

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ పట్ల సానుభూతి పెరుగుతూ వస్తుంది. టీడీపీ అధినేతను కక్ష పూరితంగా అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం జైలుకి పంపిందని వివిద వర్గాలకి చెందిన వారు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చట్టం దాని పని అది చేసుకుపోతుందని…. తప్పు చేసిన […]

అధ్యక్షా… ఎక్కడున్నారు మీరు.. ఏమయ్యారు సార్….!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో… ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది అక్రమమని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు టీడీపీ నేతలు. అయితే ఇదంతా పది రోజుల క్రితం […]

టీడీపీ నేతలకు అంత ధీమా ఎందుకు….?

రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే… ఇప్పుడు ఇదే మాట ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కదిపినా చెప్పే మాట. ఇక నేతలైతే… మనదే అధికారం అనేస్తున్నారు కూడా. ఇందుకు ప్రధాన కారణం… పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడమే అంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌ కేసులో రూ.371 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల […]