సమంత నటన చూసి ప్రేమలో పడిపోయా..బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్ ..!

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తెలుగు అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగు జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు తాజాగా షాహిద్ కపూర్ ప్రకటించాడు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ తాజాగా ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు […]