సమంత నటన చూసి ప్రేమలో పడిపోయా..బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్ ..!

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తెలుగు అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగు జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు తాజాగా షాహిద్ కపూర్ ప్రకటించాడు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

షాహిద్ కపూర్ తాజాగా ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు తన ఫేవరెట్ డైరెక్టర్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అని తెలిపాడు. ఫ్యామిలీ మెన్ 2లో సమంత నటన గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు షాహిద్ కపూర్ స్పందిస్తూ..ఆ వెబ్ సిరీస్ లో సమంత చేసిన యాక్టింగ్ చూసి ఫిదా అయ్యానని.. ఆమె నటనకు లవ్ లో పడిపోయానని కామెంట్స్ చేశాడు.

సమంత తో పనిచేసే అవకాశం వస్తే తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. హృతిక్ రోషన్ బిగ్ స్క్రీన్ పై చూడడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్నాయని.. ప్రేక్షకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లలో సినిమాలు చూడాలని షాహిద్ కపూర్ కోరాడు. జెర్సీ రీమేక్ డిసెంబర్ 31వ తేదీ విడుదల అవుతున్నట్లు ప్రకటించాడు.