సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఈట‌ల‌..!

భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్న‌ట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట‌లోని త‌న నివాసంలో మీడియా స‌మావేశ‌మైన ఈట‌ల‌.. త‌న రాజీనామా విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక టీఆర్ఎస్‌ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని.. […]

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..ముహూర్తం ఫిక్స్‌!?

భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. జూన్‌ 4 (రేపు) టీఆర్ఎస్‌ పార్టీతోపాటు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయ‌న‌ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్టు స‌మాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ […]

వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]

అక్క‌డ జోరు.. మ‌రోచోట క‌నుమ‌రుగు

కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌. మొత్తం 140 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తున్న‌ది. ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడుతున్న‌ది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్క‌డ పూర్తిగా క‌నుమ‌ర‌గ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది. వెస్ట్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండ‌గా అందులో 292స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అందులో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]

అక్క‌డ బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు..!

బీజేపీ అస్సాంలో విజ‌యం దిశ‌గా ప‌రుగులు తీస్తున్న‌ది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్య‌త‌ను చాటుకుంటున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాల‌కు ఎగ‌బాకింది. అక్క‌డి అధికార టీఎంసీ పార్టీకి స‌వాల్‌గా నిలిచింది. ఇంత‌గా యావ‌త్ భార‌తదేశ వ్యాప్తంగా స‌త్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చ‌తికిల‌ప‌డిపోయింది. డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితికి దిగ‌జారి పోయింది. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ మూడుస్థానంలో కొన‌సాగుతుండ‌గా అక్క‌డ కేవ‌లం 15వేల ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది. […]

బెంగాల్‌లో ఓవైసీ పార్టీకి ఝ‌ల‌క్‌..!

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించ‌లేక‌పోతున్న‌ది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను 292 స్థానాల‌కు ఎనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా […]

ఈట‌ల‌కు బీజేపీ అమిత్‌షా ఫోన్‌..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన‌ మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపుల‌కు తెర‌లేపారు. శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన ఈట‌ల అక్క‌డ త‌న నియోజకవర్గ అభిమానులతో స‌మావేశ‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు స‌మాచారం. […]

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టేస్తున్న‌ది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాట‌గా, కొత్తగా.. 1,005 కరోనా […]