కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య ఫ్యాన్స్ రచ్చ

June 10, 2021 at 4:48 pm

కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య అభిమానులు రచ్చ చేశారు. నందమూరి బాలకృష్ణ బర్త్ డే అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ సారి ఆ సందడి మిస్ అయ్యింది. పాండమిక్ సిచ్యుయేషన్‌లో నో మోర్‌ సెలబ్రేషన్స్ అంటూ ముందే చెప్పేశారు బాలకృష్ణ. మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటే అదే నాకు బిగ్గెస్ట్ సెలబ్రేషన్‌ అంటూ హార్ట్ టచింగ్ మెసేజ్‌తో ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేశారు.బయటికొచ్చే పరిస్థితి లేకపోయినా బాలయ్య ఫ్యాన్స్ హడావిడి మాత్రం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తున్నారు నందమూరి అభిమానులు.

అఖండ టీమ్ రిలీజ్ చేసిన బర్త్ డే పోస్టర్‌ను రీ ట్వీట్స్‌ చేస్తూ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. కామన్ డీపీలు ఫ్యాన్‌ మేడ్ పోస్టర్‌ల సందడి కూడా మామూలుగా లేదు. అయితే ఇటువంటి సమయంలో కొందరు అభిమానులు కొడాలి నాని ఇంటి వద్ద సందడి చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య డైలాగులను ప్రయోగిస్తూ వారు రచ్చ రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొడాలి నాని ఇంటి ముందు బాలయ్య ఫ్యాన్స్ రచ్చ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts