జ‌గ‌న్‌లో మార్పు వెనుక కార‌ణాలివేనా.. 

సీఎం చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సీనియ‌రిటీనేగాక‌, ఉద్యోగులు కూడా కొంత కార‌ణం! 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గ‌తంలోలా ఉద్యోగుల‌తో క‌ఠినంగా వ్య‌వహ‌రించ‌ను` అని చంద్ర‌బాబు పదేప‌దే చెబుతూ వారిలో న‌మ్మ‌కం క‌లిగేలా చేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఇప్ప‌టినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేత‌లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ వెన‌క‌..!

టీడీపీ అంటే ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్న‌ద‌మ్ముళ్లా క‌లిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గ‌తం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక పార్టీలో ఎవ‌రికి వారే ఇష్ట‌మొచ్చిన‌ట్టు స్వ‌రం పెంచేస్తున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వార్నింగ్‌లు కూడా ప‌ని చేయ‌డం లేదు. చాలా మంది అయితే చంద్ర‌బాబునే లైట్ తీస్కొంటున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఎవ‌రో ఒక నాయ‌కుడు నోరు జార‌డం, అది మీడియాలో హైలెట్ […]

టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ పనైపోయిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహ‌న్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన బాబూ మోహ‌న్ మెద‌క్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నిక‌తో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహ‌న్ రెండుసార్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించాడు. […]

2019 వార్‌: ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రు ఎవ‌రికి ఫ్రెండో..!

2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల టైం ప‌క్కన పెట్టేస్తే 15 నెల‌లు మాత్ర‌మే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తారు ? అధికార పార్టీల‌ను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంట‌న్న‌దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామ‌న్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీల‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్ని ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]

ప్ర‌శాంత్ ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డిందిగా..

`నువ్వు మారాలి.. నీ వ్య‌వ‌హార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌లు ఎంత‌మంది చెప్పినా ప‌ట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌!! నిన్న‌మొన్న‌టి వ‌రకూ టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జ‌గ‌న్ నిజంగానే మారిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న సంఘ‌ట‌న‌లు, ఆయ‌న మాట‌తీరు గ‌మ‌నించి వారంతా ఇప్పుడు ఆశ్చర్య‌పోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం […]

ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై జ‌క్క‌న్న షాకింగ్ కామెంట్స్‌

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఈ పేరు విన‌గానే ముందుగా గుర్తొచ్చేది మంచి డాన్సర్, మంచి న‌టుడు.. ఎంత‌టి డైలాగులైనా అవ‌లీల‌గా.. అల‌వోక‌గా చెప్పేస్తాడు.. ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగాలు చేయ‌డంలో దిట్ట‌! ఇవే అంద‌రిలోనూ ఉన్న అభిప్రాయాలు! కానీ ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన‌, ఎంతో స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో జ‌క్క‌న్న రాజ‌మౌళి కూడా ఒక‌రు. అయితే అంద‌రూ ఎన్టీఆర్‌లో న‌టుడిని చూస్తే.. జ‌క్క‌న్న మాత్రం మ‌రో ఎన్టీఆర్‌ను చూశార‌ట‌. ఎన్టీఆర్‌కు సినిమాల త‌ర్వాత రాజ‌కీయాలే బాగా సెట్ అవుతాయంటూ […]

జ‌న‌సేన‌లో క‌న్నాకు ప్ర‌త్య‌ర్థి రెడీ..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి! విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు అత్యంత కీల‌కంగా మారిన గుంటూరులో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని పవ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఎలా ఉంటుందో తెలియ‌దుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజ‌కీయ పార్టీల నేత‌లకు మాత్రం క‌ల్ప‌త‌రువుగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయ‌కులు వేచిచూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో గుంటూరు రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]

రామోజీకి – చంద్ర‌బాబుకు దూరం ఎందుకు

తెలుగుదేశం-ఈనాడు బంధం బీట‌లు వారుతోందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది ద‌శాబ్దాల అనుబంధం! ప్ర‌స్తుతం ఇది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు త‌ర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్ర‌జ్యోతికి సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టం కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు రామోజీరావును చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్ట‌డం వెనుక కార‌ణాలేంట‌నే […]

గంటాను వ‌దిలించుకుంటోన్న బాబు

ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయ‌నకు ఒకే పార్టీలో ఉండి రాజ‌కీయాలు చేయాల‌న్న సూత్రం ఏదీ ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌కు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న టీంతో క‌లిసి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గంటాకు జిల్లాలో […]