ప్రత్తిపాడులో సైకిల్ జోరు..మూడోసారైనా గెలుస్తుందా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం..టి‌డి‌పి కంచుకోట..1983 నుంచి 2009 వరకు టి‌డి‌పి అయిదుసార్లు గెలిచింది. కానీ 2014 నుంచి టి‌డి‌పికి లక్ కలిసిరావడం లేదు. వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. అది కూడా తక్కువ మెజారిటీలతో 2014లో 3 వేల ఓట్లతో, 2019 ఎన్నికల్లో 4 వేల ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడింది. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలని చెప్పి టి‌డి‌పి కష్టపడుతుంది. ఇదే క్రమంలో దివంగత వరుపుల రాజాని పార్టీని బలోపేతం […]

పవన్ రెడీ..జనసేనకు కలిసొస్తుందా?

చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు. ఎప్పుడో  పార్టీ ఆవిర్భావ సమయంలో కనిపించారు. ఆ తర్వాత వర్షాల వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించేందుకు వచ్చారు. ఇంకా అంతే ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలు గాని, పార్టీ కోసం జనంలో తిరగడం చేయలేదు. పూర్తిగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు […]

పవన్‌కు పొత్తు సెట్ కాదా? వైసీపీ గేమ్.?

టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని చెప్పి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అనే సంగతి వైసీపీ గ్రహించింది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ది జరుగుతుందనేది వైసీపీ భావన. కానీ టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేసే […]

వారాహితో పవన్..తమ్ముళ్ళల్లో టెన్షన్..ఆ సీట్లే డౌట్!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో జనసేన అధినేత పవన్ సైతం ఇంకా జనంలోకి రావడానికి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వారాహి బస్సుతో ప్రజల్లోకి వస్తున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగా ఆయన యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. జూన్ 14న అన్నవరంలో పూజలు తర్వాత..ప్రత్తిపాడు నుంచి ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ప్రత్తిపాడు తర్వాత పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, […]

వారాహితో పవన్ రెడీ..జనసేన స్థానాలపైనే గురి.!

మొత్తానికి ఎన్నికల సమరంలోకి పవన్ కూడా దిగుతున్నారు. ఇంతకాలం ఆయన సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉండిపోయారు. కానీ ఇటు ఏపీలో జగన్, చంద్రబాబుల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అలాగే ఎన్నికల సమరానికి ఇద్దరు నేతలు రెడీ అయ్యారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో బాబు మరింత దూకుడుగా ఉంటూ..అభ్యర్ధులని సైతం ఖరారు చేసే పనిలో ఉన్నారు. అటు మేనిఫెస్టోని సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. అటు జగన్ భారీ […]

వైసీపీ వర్సెస్ జనసేన..పవన్ బరిలో దిగే సీటులో రచ్చ.!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ-జనసేన ఓ రేంజ్ లో పోరాటం చేస్తున్నాయి. ఇక రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతుండటంతో వైసీపీ సైతం..రెండు పార్టీలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టే దిశగానే రాజకీయం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా వైసీపీ తగ్గడం లేదు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్న విషయం తెలిసిందే. అందుకే పేదలని కాపాడుతూ […]

ఆ వైసీపీ నేతలకు పవన్‌తోనే నష్టం..అందుకే టార్గెట్.!

ఎప్పుడో రాక రాక ఏపీలో అడుగుపెడతారు. ఇక ఆయన అడుగు పెట్టడమే ఆలస్యం వైసీపీ నేతలు మీడియా సమావేశాలతో రెడీగా ఉంటారు. ఆయన టార్గెట్ గా ఓ రేంజ్ లో విమర్శలు చేయడం, తిట్టడం చేస్తారు. పైగా ఇప్పుడు పవన్..టి‌డి‌పితో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశారు. దీంతో వైసీపీ నేతలు మరింత ఎటాకింగ్ మొదలుపెట్టారు. పవన్‌ని ఓ రేంజ్ లో టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అభిమానులని, కాపులని పవన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే వారి […]

కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!

పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టి‌డి‌పి, బి‌జే‌పిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ […]

పొత్తులతోనే ముందుకు..సీఎం అభ్యర్ధి అప్పుడే ఫిక్స్.!

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫిక్స్ అవుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు పొత్తులతోనే ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి..ఇలా మూడు పార్టీలు పొత్తులోనే వెళ్తామని అంటున్నారు. అయితే ఎవరు కలిసొస్తారో లేదో తనకు తెలియదని, ఇప్పటివరకు జరిగిన చర్చలు ప్రకారం..మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని, అలాగే ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి చర్చ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. తమ ప్రత్యర్థి వైసీపీయేనని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తుల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే […]