గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదా? పవన్‌కు సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ అధికారంలో నుంచి దిగిపోవాలని పవన్ అంటున్నారు.ఈ క్రమంలో టి‌డి‌పితో కలిసి ఆయన ముందుకెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్..రాజోలు సభలో వైసీపీ నేతలకు ఓ సవాల్ చేశారు. అసలు గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీని గెలవనివ్వనని అన్నారు. అయితే టి‌డి‌పి తో కలిసి గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని అన్నారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీకి 14 సీట్లు వచ్చాయి..పశ్చిమలో 15 సీట్లు ఉంటే 13 సీట్లు వచ్చాయి. కేవలం ఇన్ని సీట్లు గెలవడానికి టి‌డి‌పి, జనసేన విడిగా పోటీ చేయడమే. అదే కలిసి పోటీ చేసే సీన్ రివర్స్ అయ్యేది. 2014లో తూర్పులో టి‌డి‌పికి జనసేన మద్ధతుగా నిలిచింది. అక్కడ 14 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. పశ్చిమలో 15కి 15 సీట్లు టి‌డి‌పి-బి‌జే‌పి గెలుచుకున్నాయి. వైసీపీకి ఒక్క సీటు రాలేదు.

అయితే ఈ సారి రెండు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని పవన్ చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా అంటే? పశ్చిమలో కాస్త సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి గాని..తూర్పులో కాస్త కష్టమే. ఎందుకంటే అక్కడ వైసీపీకి అనుకూలమైన స్థానాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో ఓడించడం కష్టమే. చూడాలి మరి టి‌డి‌పి, జనసేన పొత్తు ప్రభావం గోదావరి జిల్లాలపై ఏ మేర ఉంటుందో.