వేణు స్వామి తో మరో స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు…!!

టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ డింపుల్ హయాతి.. గత కొద్దిరోజుల క్రితం ఒక క్రిమినల్ కేసు వల్ల మరింత పాపులారిటీ సంపాదించింది. డింపుల్ హయాతి తరచూ గ్లామర్ షోను సైతం చేస్తూ అందాల ప్రదర్శనతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఈమె అందంతోనే గ్లామర్ తో ఎన్నో అవకాశాలు అందుకున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. దీంతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తో ఈమె కూడా పూజలు చేయించినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం

ఆస్ట్రాలజర్ వేణు స్వామిని నమ్మి గతంలో ఎంతోమంది సిని సెలబ్రిటీల సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం జరిగింది. అలా చేయించుకున్న వారి కెరియర్ మొత్తం సక్సెస్ గా ముందుకు సాగుతోందని చెప్పవచ్చు.. అలా గతంలో హీరోయిన్ రష్మిక ,నిధి అగర్వాల్ తదితర హీరోయిన్స్ సైతం వేణు స్వామి తో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి హీరోయిన్ డింపుల్ హయాతి కూడా చేరినట్టు తెలుస్తోంది. డింపుల్ హయాతి కెరియర్ అసలు సాఫీగా సాగలేదని ఈమెకు అవకాశాలు వస్తున్న సక్సెస్ అందుకోలేకపోతుందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

రవితేజ తో ఖిలాడి సినిమాలో నటించిన ఫ్లాప్ గా నిలిచింది. గోపీచంద్ తో రామబాణం సినిమాలో ఈ అమ్మడు నటించిన ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈమె జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. ఐపీఎస్ అధికారి రాహుల్ ఈమె మీద కేసు వేయడం జరిగింది తన వాహనాన్ని కాలితో తన్నట్లుగా ఆరోపిస్తూ కేసు వేయడం జరిగింది ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం ఇలాంటి సమస్యలన్నీ కూడా గట్టెక్కించేందుకు డింపుల్ హయాతి వేణు స్వామిని సంప్రదించినట్లు సమాచారం.