వివాహం చేసుకోబోతున్న హీరో అర్జున్ కూతురు.. వరుడు ఎవరంటే..?

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికి పలు చిత్రాలలో విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అప్పట్లో ఎక్కువగా అర్జున్ యాక్షన్ సన్నివేశాలలో నటించేవారు.ఆ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండేవి.యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈయన సినీ వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా.. తమిళంలో హీరో విశాల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Actor Arjun Sarja's daughter Aishwarya tests positive for COVID-19

ఆ తర్వాత కన్నడలో కూడా ఒక సినిమాలో చేసింది తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతూ ఒక సినిమాను ప్రకటించిన అది ఎందుకు ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఐశ్వర్య కి సంబంధించి ఒక న్యూస్ తమిళ మీడియాలో వైరల్ గా మారుతోంది ..అదేమిటంటే ఐశ్వర్య సర్జ త్వరలోనే వివాహం చేసుకోబోతోందట.. గత కొన్నేళ్ల నుంచి ఐశ్వర్య ఒక స్టార్ కమెడియన్ కొడుకుతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..వీరిద్దరి ప్రేమను ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇంతకీ ఆ స్టార్ కమెడియన్ ఎవరైనా ఆలోచిస్తున్నారా తమిళ సినీ పరిశ్రమలో కామెడీతో అలరించిన తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని తమిళ మీడియా ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు సంబంధించి ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇరువురు కుటుంబ సభ్యులు మాత్రం స్పందించలేదు. మరియు వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. ఉమాపతి కూడా తమిళంలో హీరోగా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం.