డ్రగ్స్ కేసు వ్యవహారంపై వీడియోతో క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి..!!

తెలుగు సినీ పరిశ్రమలో అక్క ,అమ్మ వంటి క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సురేఖ. ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో చిక్కడంతో..సినీ ఇండస్ట్రీలో ఈ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఈయనతో కొంతమంది యాక్టర్స్ సైతం టచ్ లో ఉన్నారని వారంతా కూడా డ్రగ్స్ బాధితులే అన్నట్లుగా తెలియజేసినట్టుగా అధికారులు తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో నటి సురేఖ వాణి పేరు కూడా వినిపించడంతో ఆమె తాజాగా డ్రగ్స్ వ్యవహారం పైన ఒక వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఈ డ్రగ్స్ వ్యవహారంలో సురేఖ వాణి లేదు అనుకుంటున్న సమయంలోనే కేపీ చౌదరి బుగ్గ పైన ఈమె ముద్దు పెడుతున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సురేఖ వాణి ఇలా చేసిందంటే ఆరోజు మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉందని పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేయడం జరుగుతోంది .ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది.సురేఖ వాణి తనపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇస్తు ఈ డ్రగ్స్ కేసులో తన పేరు రావడం నిజం కాదు..

గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని.. దయుంచి మాపైన ఆరోపణలు చేయడం మానేయండి.మీరు చేస్తున్న వాటి వల్ల మా సినీ కెరియర్ తమ పిల్లల కెరియర్ కుటుంబం ఆరోగ్యం ఇలా అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ చూపుతుందని ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది నటి సురేఖ వాణి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.