ప‌వ‌న్ ప‌నికి క‌కావిక‌ల‌మైన మెగా ఫ్యాన్స్‌

మెగా ఫ్యాన్స్‌కి ప‌వ‌ర్‌స్టార్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు! వాస్త‌వానికి ఫ్యామిలీ రిలేష‌న్స్‌లో కాస్త డిఫ‌రెంట్‌గా ఉండే ప‌వ‌న్‌.. గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా హీరోల మూవీల‌కు సంబంధించి ఏదైనా ఫంక్ష‌న్ జ‌రిగితే.. మ‌మ్మ‌ల్ని పిలిస్తే బాగుండు అనుకునే వాళ్లు వంద‌ల సంఖ్య‌లో ఉంటారు. అలాంటిది ప‌వ‌న్ మాత్రం త‌న సొంత ఫ్యామిలీకి కాస్త దూరంగానే ఉంటారు. రామ్ చ‌రణ్ కానీ, బ‌న్నీకానీ ఇలా ఎవ‌రి ఆడియోలేదా మూవీ ఫంక్ష‌న్ల‌కి ఆయ‌న హాజ‌రైంది లేదు. దీంతో అంద‌రూ […]

జ‌న‌సేన‌లోకి టీడీపీ ఎమ్మెల్యే..!

పాలిటిక్స్ అన్నాక శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు అంటారు! అప్ప‌టి వ‌ర‌కు ఒక పార్టీలో మంత్రులుగా అధికారం చ‌లాయించి, పార్టీ అధినాయ‌క‌త్వంతో రాసుకు పూసుకొని తిరిగిన నేత‌లు.. అధికారం చేయి మారిన మ‌రుక్ష‌ణం అప్ప‌టి వ‌ర‌కు మోసిన పార్టీ జెండాను ప‌క్క‌న ప‌డేసి.. పార్టీలు మారుతున్న‌ సందర్భాలు అనేకం! ఈ విష‌యంలో ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు వారివి!! ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్ర‌స్తుతం ఇంకా పూర్తిస్థాయిలో కేడ‌ర్‌ త‌యారు కాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ […]

ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో […]

2019 వార్‌: టీడీపీ+బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌

ఏపీ రాజ‌కీయాల్లో నిన్న‌టి వ‌ర‌కు ఉన్న మబ్బులు వీడుతున్నాయి. మసకలు తొలగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని కొద్ది రోజులుగా చెపుతూ వ‌స్తోన్న ప‌వ‌న్ బుధ‌వారం అనంత‌పురం స‌భ‌తో మ‌రింత క్లారిటీ ఇచ్చాడు. తాను 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఘంటాప‌థంగా చెప్పేశాడు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ముక్కోణ‌పు పోరుకు తెర‌లేచిన‌ట్ల‌య్యింది. అనంత‌పురం స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగం చూస్తే పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ స్టైల్ మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గతంలో పంచెలూడదీసి కొడతాం అంటూ పరుషంగా మాట్లాడిన […]

పవన్ ఎంట్రీతో అక్కడ టీడీపీకి చుక్కలే

రాష్ట్ర విభ‌జ‌న తరువాత ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోను విభిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కూ సినీ గ్లామ‌ర్ అంత‌గా ప‌నిచేయ‌ద‌నే చెప్పాలి. అక్క‌డ స్థానిక స‌మ‌స్య‌లు, నాయ‌కులే పార్టీల గెలుపు ఓట‌మిల‌ను ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి గ‌తంలో ఉండ‌గా.. ఇక ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రాంతీయ‌వాదం భుజాన వేసుకుని.. అదే విధ‌నాన్ని కొన‌సాగిస్తూ… అక్క‌డి రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరింది. ఇక ఏపీలో సినీ గ్లామ‌ర్‌తో పాటుగా కుల రాజ‌కీయాల‌దే మొద‌టినుంచీ […]

అప్పుడే జ‌న‌సేన మూట ముల్లు స‌ర్దేసిందా..!

సినీ న‌టుడిగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే… మ‌రోప‌క్క పూర్తిస్థాయి రాజ‌కీయ‌వేత్త‌గానూ అవ‌తార‌మెత్తేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. పశ్చిమ‌గోదావ‌రిని త‌న రాజ‌కీయాల‌కు కేంద్రంగా మ‌లుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది. ఏలూరుకు త‌ర‌లి రావాల‌న్న‌ ప‌వ‌న్ తాజా నిర్ణ‌యంతో రాజ‌కీయవ‌ర్గాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌ను , సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. […]

పాల‌కొల్లు అసెంబ్లీ బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

సైలెంట్‌గా ఉంటూనే… సంచ‌ల‌నాలు సృష్టించ‌డంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ త‌ను తీసుకున్న‌ తాజా నిర్ణ‌యంతో  మ‌రోసారి రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడిని పుట్టించారు.  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ప‌వ‌న్‌ ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోబోతున్నార‌ని, ఇక్క‌డే నివాసం ఉండేందుకు త‌న‌కు త‌గిన అనువైన ఇంటిని కూడా చూస్తున్నార‌ని…, పవ‌న్ త‌న అభిమాన‌, అనుచ‌ర‌గ‌ణానికి ఆ బాధ్య‌త అప్ప‌గించార‌ని జ‌న‌సేన ప్ర‌తినిధి రాఘవ  సోమ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న ఇప్పుడు రాష్ట్ర […]

చిరును లైన్లో పెడుతున్న చంద్ర‌బాబు

ఏంటి స‌ర్‌ప్రైజింగ్‌గా ఉందా?  చిరు ఏంటి? చ‌ంద్ర‌బాబు ఆయ‌న‌ను లైన్‌లో పెట్ట‌డం ఏంట‌ని ఆలోచిస్తున్నారా?  పాలిటిక్స్ అంటే అవేగామ‌రి! ఎప్పుడు ఎవ‌రిని దువ్వాలో ఎప్పుడు ఎవ‌రిని రువ్వాలో అనే స‌బ్జెక్ట్ పాలిటిక్స్‌లో పెద్ద ట్రిక్‌. రానున్న 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కి ఏపీ పాల‌న‌ను సుస్థిరం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్‌తో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి నుంచే త‌న ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వాస్త‌వానికి టీడీపీలో […]

ప‌వ‌న్ మూడో స‌భ‌లో ఆయ‌నే టార్గెట్‌..!

జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత బ‌హిరంగ స‌భ‌పై ప్ర‌జ‌ల్లో ఆశ‌లు పెరిగాయి. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోస‌మే త‌న పోరు సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ సారి ఎవ‌రిని టార్గెట్‌గా చేసుకుంటారో? ఎవ‌రిమీద పంచ్‌లు విసురుతారో? అని స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి అంచ‌నాలు, లెక్క‌లు వాళ్లు వేసుకుంటున్నారు. వ‌ప‌న్ నిర్వ‌హించే స‌భ‌ల‌కు ఓ ప్ర‌త్యేకత కూడా […]