మోహన్ బాబు, నాగార్జున.. చిరంజీవికి ఎవరంటే ఇష్టం?

చిరంజీవి, మోహన్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరూ అద్భుత నటులు. టాలీవుడ్ లో ప్రస్తుతం వీరిద్దరు సీనియర్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా వీరి అనుబంధం కొనసాగుతుంది. ఇంచుమించు ఇద్దరూ ఒకే సమయంలో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. […]

బంగార్రాజుకు ఏపీ ఝలక్.. ఇలా అయితే కష్టమే!

టాలీవుడ్‌కు కరోనా గడ్డు కాలం ఇంకా ముగియకుండానే వరుసగా దెబ్బమీద దెబ్బ పడుతూ వస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని చాలా సినిమాలు లైన్ కడితే, కరోనా మూడో వేవ్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కారణంగా మరోసారి దేశం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మళ్లీ […]

సినిమాల్ని వదిలేద్దామనుకున్న వ్యక్తి ఎలా బంగార్రాజుకి దగ్గరయ్యాడు?

ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్ల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమానీ కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ఇక మొదటి సినిమానే మంచి విజయాన్ని సాధించింది. కళ్యాణ్ కృష్ణ టేకింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత మిగతా సినిమాల జోలికి వెళ్లని కళ్యాణ్ కృష్ణ ఇక సోగ్గాడే […]

మెకానికల్ ఇంజనీరింగ్ చదువులు చదివి సినిమాల్లోకి వచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే!

డాక్టర్ అయ్యేవాడు యాక్టర్ అయ్యాడు అనే ఒక నానుడి చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉన్నత చదువులు చదివినవారు ఉద్యోగం వ్యాపారం వైపు అడుగులు వేయకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి మారినవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఒక వైపు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారసులు ఉంటే మరోవైపు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.   అక్కినేని నాగార్జున : […]

నాలుక మడతేసిన నాగార్జున.. ఫుట్ బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు

నాలుక మడతేయడం.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలోనూ అనాదిగా వస్తోంది. తాజాగా ఈ లిస్టులో చేరాడు.. అక్కినేని నాగార్జున. ఒకే అంశం గురించి గతంలో ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యాడు. తాజాగా ఆయన ఏపీలో టికెట్ ధరల తగ్గింపు గురించి స్పందించాడు. దీనికి సంబంధించి ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటజన్లు ఆయనను ట్రోలింగ్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. టికెట్ల ధరల పెంపు […]

బూరెల బుట్టలో పడ్డ బంగార్రాజు.. ఇక తిరుగు లేదు?

సంక్రాంతి వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులందరికీ పండగే. ఎందుకంటే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటాడు. సంక్రాంతికి విడుదల చేస్తే ఆ కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని భావిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయ్. అయితే ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మేనియా […]

నాగార్జునను బాగా వేధించిన సమస్య ఏంటో తెలుసా?

నాగార్జున వయసు 60 ఏండ్లు దాటినా.. ఆయన 30 ఏండ్ల యువకుడి లాగే కనిపిస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ హీరోగా.. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. అయితే ఆయన గ్లామర్ కు కారణాలు చాలా ఉన్నాయట. పుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేస్తాడట. ఆరోగ్యం విసయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాడట. ఇంత కఠినంగా ఉండే నాగార్జున సైతం ఓ వ్యసనానికి బానిస అయ్యాడట. ఇంతకీ ఆయను […]

సినిమా రాజకీయాలు.. ప్రమాద ఘంటికలు!!

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేపీహెచ్బీ కాలనీ లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి థియేటర్ మొత్తం దాదాపు అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాస్తూ అగ్నిప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవ్వరు థియేటర్లో లేకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం పలు విషయాల చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం వర్సెస్ ప్రభుత్వం అన్నంత రేంజ్ […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలేను ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె విజ‌య‌వంతంగా పూర్తైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో చివ‌ర‌కు విజే.స‌న్నీ విజేత‌గా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటుగా రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ, ఇర‌వై ల‌క్ష‌లు విలువ చేసే ఫ్లాట్‌, అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎంత వైభవంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ ఫినాలే […]