సినిమాల్ని వదిలేద్దామనుకున్న వ్యక్తి ఎలా బంగార్రాజుకి దగ్గరయ్యాడు?

January 10, 2022 at 3:08 pm

ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్ల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమానీ కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ఇక మొదటి సినిమానే మంచి విజయాన్ని సాధించింది. కళ్యాణ్ కృష్ణ టేకింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత మిగతా సినిమాల జోలికి వెళ్లని కళ్యాణ్ కృష్ణ ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ను అలరించబోతోంది అన్న విషయం తెలిసిందే.

 

ఇక ఈ సినిమాలో నాగార్జున తో పాటు కొడుకు నాగచైతన్య కూడా నటించడం గమనార్హం.. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున రమ్యకృష్ణ కాంబినేషన్ చూశాము. ఇక ఇప్పుడు నాగచైతన్య కృతి శెట్టి శెట్టి కాంబినేషన్ ఈ సీక్వెల్లో ప్రేక్షకులను అలరించబోతోంది. రాధేశ్యామ్ ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో అకస్మాత్తుగా బంగార్రాజు సినిమాని సంక్రాంతి బరిలో దింపారు. దీంతో శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులందరికీ బంగార్రాజు సినిమా దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన అనుభవాలను పంచుకునీ ఎమోషన్ అయ్యాడు.

 

సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత ఎదురైనా కష్టనష్టాల చూసి సినిమాలను వదిలేయాలి అని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అందరూకూర్చో బెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారని.. ఇకనాగార్జున కూడా ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు అంటూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవ అంటూ సపోర్టు ఇవ్వడంతో ఇక ఈ రోజు బంగార్రాజు సినిమా తీయగలిగాను అంటూ కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు వినగానే బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టి దర్శకుడి సమస్యలు అన్ని పోవాలి అంటే ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ప్రేక్షకులు.

సినిమాల్ని వదిలేద్దామనుకున్న వ్యక్తి ఎలా బంగార్రాజుకి దగ్గరయ్యాడు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts