మెకానికల్ ఇంజనీరింగ్ చదువులు చదివి సినిమాల్లోకి వచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే!

డాక్టర్ అయ్యేవాడు యాక్టర్ అయ్యాడు అనే ఒక నానుడి చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉన్నత చదువులు చదివినవారు ఉద్యోగం వ్యాపారం వైపు అడుగులు వేయకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి మారినవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఒక వైపు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారసులు ఉంటే మరోవైపు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 

అక్కినేని నాగార్జున : టాలీవుడ్ మన్మధుడు గా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున తండ్రి నాగేశ్వరరావు వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. కాగా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాగార్జున మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తితో ఇటువైపుగా అడుగులు వేశారు.

గౌతమ్ మీనన్ : ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా కొనసాగుతున్న గౌతమ్మీనన్ కూడా ఏకంగా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన వదులుకొని సినిమాల వైపు అడుగులు వేసారట ఆయన.

శేఖర్ కమ్ముల : తెలుగు చిత్ర పరిశ్రమలో ఫీల్గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శేఖర్ కమ్ముల యూత్ని ఆకర్షించే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈయన కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఇక ఆ తర్వాత దర్శకుడిగా అవతారమెత్తాడట.

కార్తి : తండ్రి, అన్నా వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. అయితే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కార్తి కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాడట. ఆ తర్వాత సినిమాల వైపు నడిచి మణిరత్నం దగ్గర కొన్నాళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడట హీరో కార్తి.

అవసరాల శ్రీనివాస్ : దర్శకుడిగా నటుడిగా రైటర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళపాటు అమెరికాలో ఉద్యోగం కూడా చేశాడట. కానీ ఆ తర్వాత మాత్రం సినిమాలపై ఆసక్తితో ఇక ఉద్యోగానికి గుడ్ పై చెప్పేసి సినిమాల వైపు వచ్చాడట..

నవీన్ చంద్ర : హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న నవీన్ చంద్ర బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాక కొన్నాళ్లపాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడట. ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఇక ఇప్పుడు అవకాశాలు అందుకుంటున్నాడు.

తరుణ్ భాస్కర్ : పెళ్లిచూపులు లాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా తెరకెక్కించి మొదటి సినిమాతోనే ఎంతగానో పాపులారిటీ సంపాదించారు తరుణ్ భాస్కర్. ఇక ఈ దర్శకుడు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడట. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నటుడిగా రాణిస్తున్నారు తరుణ్ భాస్కర్.