అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే […]
Tag: Movie News
ఆమెతో నటించాలంటేనే భయం అంటున్న మహేష్!
బాలనటుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించగలిగే మహేష్ కు.. ఒకరితో నటించాలంటే చాలా భయమట. ఇంతకీ ఆ ఒకరు ఎవరో కాదు.. ఆయన కుమార్తె సితార. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబునే తెలిపారు. […]
వెంకీని ఫాలో అవ్వబోతున్న చిరు..త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..?
ఇటీవల `నారప్ప` సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే దృశ్యం 2తో అలరించబోతున్నారు. మరోవైపు వెంకీ డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధం అయ్యారు. రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఈయన ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్ `రే డోనోవాన్` ను `రానా నాయుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సిరీస్ త్వరలో సెట్స్ […]
మళ్లీ ఆ ఫార్ములానే వాడుకుంటున్న రవితేజ..వర్కోట్ అవుతుందా?
`క్రాక్` సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వచ్చిన మహా మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈయన చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒకటి. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ […]
కొత్త యాంగిల్ చూపించిన కీర్తి సురేష్..ఫిదా అవుతున్న నెటిజన్స్!
బాల్య నటిగా మలయాళంలో పలు చిత్రాలు చేసిన అందాల భామ కీర్తి సురేష్.. `నేను శైలజ` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, చిరంజీవి నటిస్తున్న భోళ శంకర్, గుడ్ లక్ సఖీ చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసింది. […]
ఆ యంగ్ హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..ఫైరవుతున్న నెటిజన్స్?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే శరత్ మండవ దర్శకత్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాన్ని సైతం పట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. అయితే […]
రిలీజ్ రోజే సూపర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `లవ్ స్టోరీ`!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం `లవ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుము ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్స్‌లో విడుదల అయింది. అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూపర్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల విడుదలైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్పటికే […]
గ్రాండ్‌గా విడుదలైన `లవ్ స్టోరీ`..చైతు బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుంచీ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 900 థియేటర్స్ లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా […]
`శ్యామ్ సింగరాయ్`పై న్యూ అప్డేట్..ప్రముఖ ఓటీటీతో భారీ డీల్..?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. […]