`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?

September 23, 2021 at 2:27 pm

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Nani starts shoot of 'Shyam Singha Roy'

ఇటీవ‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ విష‌యంలో మేక‌ర్స్‌కు, ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు మ‌ధ్య భారీ డీల్ కుదిరింద‌ట‌.

Shyam Singha Roy: Sai Pallavi looks fierce in first look of film, Nani  shares a special message for the actor | Entertainment News,The Indian  Express

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. నెట్ ఫ్లిక్స్ శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్ ను ఏకంగా రూ. 40 కోట్లు కు కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ఇక ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. ఆ తర్వాత ఓటీటీలో విడుదల కానుందని స‌మాచారం. కాగా, ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండ‌గా..జంగ సత్యదేవ్ క‌థ అందించారు.

`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts