సుకుమార్ ఇంట్లో ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్..?

September 23, 2021 at 2:30 pm

టాలీవుడ్ లో లెక్కలు మాస్టారు గా బాగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.ఒకప్పుడు ఈ డైరెక్టర్ ఫ్యామిలీ లైఫ్ కంటే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎప్పుడైతే ఆయన సతీమణి తబితా తన లైఫ్ లోకి రాగానే అప్పట్నుంచి సుకుమార్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అలాగే ఫ్యామిలీ లైఫ్ తో కూడా చాలా సమయాన్ని గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.

సుకుమార్ భార్య తన జీవితం లోకి రావడం వల్ల కుమార్ కి చాలా వరకు భారం తగ్గిందనే చెప్పాలి. ఇక భార్య ప్రేమకు సుకుమార్ కూడా అదే తరహాలో ప్రేమను అందిస్తున్నాడు. ఈయన సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. రీసెంట్ గా తన భార్య తబితా పుట్టినరోజు కావడంతో ఇంట్లో తన కుటుంబ సభ్యులతో పార్టీ నీ ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా కొడుకు కూతురుతో కలిసి ఈ పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్టు మనకి కనిపిస్తుంది.

ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను కూడా తబితా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సుకుమార్ ఎంత బిజీగా ఉన్నా కూడా తన భార్య విషయంలో దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇకపోతే సుకుమార్ భార్యకు ఇటీవల కొత్తగా బాధ్యతలను కూడా ఇచ్చారు. ప్రొడక్షన్ హౌస్ లో కొన్ని సినిమాల కథలపై ఆమె దృష్టి పెట్టారు. సినిమా విషయంలో ఏ సినిమాకు ఎంత పెట్టుబడి ఖర్చవుతుందో అనే ఈ విషయంపై భార్య సలహాలను ఎక్కువ గానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ ఇంట్లో ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts