మ‌ళ్లీ ఆ ఫార్ములానే వాడుకుంటున్న ర‌వితేజ‌..వ‌ర్కోట్ అవుతుందా?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన మ‌హా మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‏గా కనిపించబోతున్నాడు.

Krack Movie Closing Box Office Collections

అలాగే ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రానికి క్రాక్ ఫార్ములానే వాడుతున్నార‌ట‌.

Ramarao on Duty: Ko2 దర్శకుడితో మాస్ మహరాజ్.. రామారావు ఆన్ డ్యూటీ! | Ravi  Teja as 'massiest officer' Rama Rao On Duty

క్రాక్ చిత్రంలో ర‌వితేజ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించగా, శృతిహాసన్ ఆయ‌న‌కు భార్య‌గా, ఒక బిడ్డ తల్లిగా నటించి మెప్పించింది. అయితే రామారావు ఆన్ డ్యూటీలోనూ ర‌వితేజ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో కూడా రవితేజకి ఒక భార్య మరియు కొడుకు ఉంటారని సినిమా మొత్తం మంచి ఎమోషనల్‌గా సాగుతుంద‌ని తెలుస్తోంది. మ‌రి రామారావుకు క్రాక్ ఫార్ములా ఎంత వ‌ర‌కు వ‌ర్కోట్ అవుతుందో చూడాలి.