గుడివాడ సీటుపై బాబు క్లారిటీ..కొడాలితో ఈజీ కాదు!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చంద్రబాబు…ఇప్పటికే చాలా సీట్లని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు సీట్లు ఇచ్చి ఇబ్బందులు పడటం కంటే..ఇప్పుడు ముందు నుంచి సీట్లు ఇచ్చి పార్టీకి అడ్వాంటేజ్ పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్ధులని బాబు డిక్లేర్ చేశారు. వారికి దాదాపు సీట్లు ఖాయమని చెప్పేశారు. అయితే ఇంకా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది. వాటిల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి..అందులో గుడివాడ మెయిన్ అని చెప్పవచ్చు. […]

గుడివాడకు బాబు..భారీ సభ..టీడీపీకి కలిసొస్తుందా?

తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా కసితో ఓడించాలని చూస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్పవచ్చు. ఆయనపైనే ఎందుకు కసి మీద ఉన్నారనేది అందరికీ తెలిసిందే. టి‌డి‌పిలో రాజకీయంగా ఎదిగి తర్వాత వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబుని కొడాలి నానా బూతులు తిడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఓ రేంజ్ లో బాబుని టార్గెట్ చేసి తిట్లు తిడుతున్నారు. వ్యక్తిగతంగా తిట్టడం మాత్రమే కాదు..ఫ్యామిలీ పరంగా కూడా తిడుతున్నారు. దీంతో కొడాలికి ఎలాగైనా ఈ సారి గుడివాడలో […]

గుడివాడ-గన్నవరం టీడీపీకి దక్కడం కష్టమే!

తెలుగుదేశం పార్టీకి మరొకసారి గుడివాడ దక్కేలా లేదు..కొడాలి నానికి టి‌డి‌పి చెక్ పెట్టడం కష్టమని తేలిపోతుంది…గుడివాడతో పాటు గన్నవరంలో కూడా టి‌డి‌పి ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తోంది. ఇక్కడ వల్లభనేని వంశీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని తాజా సర్వేల్లో తేలింది. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ..సర్వే విడుదల చేసిన విషయం తెలిసిందే..ఈ సర్వేలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాలని చూస్తే..ఊహించని ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ […]

బాబుకు కొడాలి చాలు..టీడీపీని లేపుతున్నారు!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుని బూతులు తిట్టే నాయకులు ఎవరంటే..కొడాలి నాని పేరు ఠక్కున చెప్పవచ్చు. అసలు కొడాలి నాని తిట్టినట్లు చంద్రబాబుని మరెవరూ తిట్టరనే చెప్పాలి. ఈయన టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి బాబుని గట్టిగా టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దారుణంగా తిడుతున్నారు. అయితే కొడాలి ఇలా తిడుతూ..బాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు ఉన్నారు. అలాగే జగన్ వద్ద మార్కులు కొట్టేసే అంశంలో బాగా యూజ్ అవుతుందని బాబుని […]

గుడివాడ-గన్నవరంల్లో బాబు-చినబాబు పోటీ..వంశీ సవాల్!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి అదే పార్టీ నుంచి రెండుసార్లు గెలిచి..ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..తమదైన శైలిలో చంద్రబాబు-లోకేష్‌లని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ స్థాయిలో తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా తిడుతున్న ఈ ఇద్దరి నేతలకు చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ అనుకున్న విధంగా వారి స్థానాల్లో టి‌డి‌పి బలపడటం లేదు. అందుకే దమ్ముంటే గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయొచ్చుగా అని వంశీ సవాల్ చేశారు. తనను, […]

కృష్ణాలో మాజీ మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పనిచేస్తున్న..అందుకు తగిన విధంగా కొందరు ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. పైగా వారిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి వారితో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం అనేది వైసీపీ పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇక […]

వెనుకబడిన కొడాలి..గుడివాడలో టీడీపీకి ఛాన్స్.!

ఎమ్మెల్యేగా ఉంటూ గడపగడపకు తిరగడంలో కొడాలి నాని విఫలమయ్యారు. పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడం లేదు..ఆ విషయం స్వయంగా కొడాలి నాని సైతం ఒప్పుకున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో జగన్..తమకు క్లాస్ పీకారని చెప్పుకొచ్చారు. తన లాంటి బద్ధకస్తులకు జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చారని, ఇకనైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని అన్నారు. అంటే ప్రజల్లో తిరగడం లేదనే కొడాలి ఒప్పుకున్నారు. పైగా అధికారంలోకి వచ్చాక గుడివాడకు కొడాలి చేసిందేమి కనబడటం లేదు. ఎందుకంటే గత […]

కొడాలికి ఎదురులేనట్లేనా..గుడివాడలో టీడీపీకి డౌటే?

గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గెలుపు అవకాశాలు కనిపించడం లేదా? ఈ సారి కూడా కొడాలి నాని సత్తా చాటడం ఖాయమేనా? ప్రస్తుతం గుడివాడలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే ఈ సారి కొడాలి గెలుపు మాత్రం అంత సులువు కాదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈజీగా కొడాలి గెలవడం కష్టమే. కాకపోతే ఇప్పటికీ గుడివాడలో కొడాలి లీడ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ ఆధిక్యాన్ని తగ్గించగలిగితేనే..గుడివాడలో టి‌డి‌పి గెలవగలదు. ఈ మధ్య వచ్చిన […]

ఐప్యాక్ సర్వే లీక్…ఐదుగురు మంత్రులే గట్టెక్కేది?

ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది..గట్టిగా చూసుకుంటే ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అందుకే ప్రతి పార్టీ ఎన్నికల్లో సత్తా చాటాడానికి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. అటు ప్రధాన పార్టీలు తమ బలాబలాలపై సర్వేలు కూడా చేయించుకుంటున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ కోసం ఐప్యాక్ సంస్థ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐప్యాక్ సంస్థ..తాజాగా చేసిన అంతర్గత సర్వేలో ఊహించని ఫలితాలు వెలువడ్డాయని ప్రచారం జరుగుతుంది. ఆ సర్వేలో మంత్రులు, మాజీ మంత్రులకు భారీ షాక్ […]