తెలంగాణ మంత్రుల‌కు ఏమైంది..?

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కుటుంబ రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయ‌న్న‌విప‌క్షాల మాట‌లు కాసేపు ప‌క్క‌న‌బెడితే..  అస‌లు కేసీఆర్ కు దీటుగా నిలిచి నెగ్గుకు రాగ‌ల నేత మ‌రొక‌రు టీఆర్ఎస్‌లో మాత్ర‌మే కాదు.. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కు మ‌రే పార్టీలోను క‌నిపించ‌డం లేద‌న్న‌ది నిష్టుర నిజం. దీంతో ఆ పార్టీ హ‌వాకు అక్క‌డ ఎదురే లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులు కాకుండా  మిగిలిన మంత్రులంతా డ‌మ్మీలు అయిపోయారంటూ విప‌క్షాలు చేస్తున్నవిమ‌ర్శ‌ల అంశాన్ని జ‌నం కూడా పెద్ద‌గా […]

హైద‌రాబాద్ రోడ్ల‌లో భారీ స్కామ్‌..!

విశ్వాసం క‌లిగించ‌లేక‌ పోతున్నాయి. అవును మ‌రి హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం రోడ్ల దుస్థితి చూస్తే ఎవ‌రికైనా అలాగే అనిపిస్తుంది మ‌రి. భాగ్య‌న‌గ‌రంలో గ‌ట్టిగా వ‌ర్షం కురిస్తే.. జ‌న‌జీవ‌నం ఏ స్థాయిలో అస్త‌వ్య‌స్తం అవుతుందో ఇటీవ‌ల అంద‌రికీ స్ప‌ష్టంగానే తెలిసొచ్చింది. న‌గ‌రంలో ప్ర‌జలకు రోడ్లు ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్నే చూపిస్తున్నాయ‌ని చెప్పాలి. కనీసం గుంతలు పూడ్చించలేని ప్రభుత్వ నిర్వాకం.. న‌గ‌ర వాసుల్లో ఆగ్ర‌హం ర‌గిలిస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఇలా ఉండ‌గా.. మరోవైపు, పూడ్చని గుంత‌లకు, వేయ‌ని రోడ్లకు కూడా కొందరు కాంట్రాక్టర్లు […]

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ బ‌లం చూస్తే షాకే

తెలంగాణ ప్ర‌జ‌ల నాడిని, అనుక్ష‌ణం ప‌సిక‌డుతూ… పాల‌న‌లో త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శిస్తూ.. అవ‌స‌ర‌మైన‌పుడు మళ్లీ ఉద్య‌మ భాష‌ను ఉప‌యోగించి ప్ర‌త్య‌ర్థుల నోళ్లు, చేతులు క‌ట్టేస్తూ టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయంగా అప్ర‌తిహ‌తంగా, ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత వేగంగా దూసుకుపోతున్నారు. సాధార‌ణంగా అధికారంలోకి వ‌చ్చాక రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ.. అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో ఏదో ఒక స్థాయిలో వ్య‌తిరేక‌త రావ‌డం.. అది పెరుగుతూ పోవ‌డం స‌ర్వ సాధార‌ణవిష‌యం. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విష‌యంలో ఈ సంప్ర‌దాయ లెక్క‌లేవీ… లెక్క‌లోకి రావ‌ని […]

మంత్రుల‌ను ఉతికి ఆరేసిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. ఆగ్ర‌హంతో ఊగిపోయారు. త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై నిప్పులు క‌క్కారు. ప్ర‌తిప‌క్షంపై ఎందుకు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఒక ప‌క్క  విప‌క్షా లు అన్నీ క‌లిసి ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే మీకు క‌నిపించ‌డంలేదా? అంత పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తుంటే మీకు వినిపించ‌డం లేదా? అంటూ ఉతికి ఆరేశారు. కేసీఆర్ ఉగ్రానికి మంత్రులంద‌రూ షాక్ అయిపోయార‌ట‌. శుక్ర‌వారం జ‌రిగిన ఈ ప‌రిణామం తెలంగాణ అధికార పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది. […]

కేసీఆర్ కోరిక బాబు తీరుస్తాడా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాన్య ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల మాట‌ల మ‌రాఠీగానే చాలామందికి తెలుసు. కానీ ఆయ‌నకు మ‌త ప‌ర‌మైన న‌మ్మ‌కాలు, సెంటిమెంట్లు, వాస్తు ప‌ట్టింపులు కూడా బాగా ఎక్కువ‌ని ఆయ‌న స‌న్నిహితులకు మాత్ర‌మే తెలుసు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోస‌మంటూ ఆయ‌న భారీగా నిర్వ‌హించిన‌  చండీయాగం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌డం కోసం ఈ యాగం నిర్వ‌హిస్తారు. ఈ యాగం ఫ‌లితంగానే అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని […]

డీకే అరుణ‌కు కేసీఆర్ దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి అయిన డీకే అరుణ ప‌ట్టుబ‌ట్టి ఉద్య‌మాలు చేసి ప్ర‌త్యేక గ‌ద్వాల్ జిల్లాను ఏర్పాటు చేయించుకున్నారు. అరుణ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో రెండు ద‌శాబ్దాలుగా త‌న హ‌వా కొన‌సాగిస్తున్నారు. 1999 నుంచి వ‌రుస‌గా ఓట‌మి లేకుంగా గ‌ద్వాల్ నుంచి విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకే విప‌క్షాల నాయ‌కులు భ‌య‌ప‌డిపోతున్నారు. కేసీఆర్‌తో పాటు అధికార టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేసే త‌క్కువ మందిలో డీకే […]

కేసీఆర్ స‌త్తాకు..ఈ స‌మ‌స్య‌లే పెద్ద స‌వాల్‌

సంప‌న్న రాష్ట్రం ఏంటి? స‌మ‌స్య‌లేంట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా?  ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌తో సంప‌న్న రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించిన విష‌యం తెలిసిందే. 2014-15 లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ ప్ర‌భుత్వం రూ.7500 కోట్ల మిగులు బ‌డ్జెట్‌తో పాల‌న‌ను ప్రారంభించింది.  ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక సంఘ‌మే స్ప‌ష్టం చేసింది. దీంతో దేశంలో గుజ‌రాత్ త‌ర్వాత సంప‌న్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఉందా? ప‌్ర‌భుత్వం డబ్బుల విష‌యంలో నిక్క‌చ్చిగానే వ్య‌వ‌హ‌రిస్తోందా? అంటే అంద‌రూ తెల్ల‌మొహం […]

కేటీఆర్‌కు క‌విత షాక్ ఇస్తుందా ఏంటి

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇప్పుడు ఓడ‌లు అనుకున్న‌వి తెల్లారేస‌రికి బ‌ళ్లుగా మారిపోవ‌డం పాలిటిక్స్‌లోనే సాధ్యం. ఇప్పుడీ స్టోరీ అంతా ఎందుక‌నుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవ‌డం స‌హా దాని అభివృద్దికి ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్న కేటీఆర్ భ‌విత‌వ్యం త్వ‌ర‌లోనే మారిపోతుంద‌ట! అంటే ఆయ‌న ఏ సీఎం అయిపోతార‌ని కాదు. ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇప్పుడున్న‌దానిక‌న్నా ఏమీ బెట‌ర్ పొజిష‌న్‌కి వెళ్ల‌ద‌ట‌. అదేంటి అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టి […]

తెలంగాణ‌లో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రిజ‌ల్ట్ ఇదే

దాదాపు 60 ఏళ్ల‌నాటి తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష నెర‌వేరింది. రెండున్న‌రేళ్ల కింద‌ట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత తాజాగా సీఎం క‌సీఆర్ నేతృత్వంలో 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా ఆవిర్భించింది. ప్ర‌జ‌ల‌కు అన్ని స్థాయిల్లోనూ పాల‌న చేరువ‌వ్వాల‌నే ప్ర‌ధాన ఆకాంక్ష‌తో జ‌రిగిన ఈ జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు సృష్టించింది. ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం సిద్దిపేట జిల్లా ప్రారంభంతో ఈ క్ర‌తువును మొద‌లు పెట్టిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ […]