ఇన్నాళ్లూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన.. టీజేఏసీలో విభేదాలు భగ్గుమన్నాయి! టీజేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై జేఏసీ నేతలు లేఖాస్త్రం సంధించడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ ఐక్యంగా ఉన్న నేతలు ఒక్కసారిగా కోదండరామ్‌పై ఎదురుదాడికి దిగడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా సొంత పార్టీ దిశగా కోదండరామ్ అడుగులు వేస్తున్న వేళ.. టీజేఏసీలో లుకలుకలు దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఈ లుకలుకల వెనుక సీఎం కేసీఆర్ చాతుర్యం ఉన్నట్లు స్పష్టంగా […]
Tag: KCR
హరీష్ ఈసారైనా సక్సెస్ అవుతాడా..!
టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొంది, ఎన్నో సమస్యలను పరిష్కరించి.. మేనమామ కేసీఆర్‌తో ప్రశంసలు అందుకున్న హరీశ్‌రావు.. తన వర్గానికి పదవులు ఇప్పించుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా తన అనుచరుడైన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మరోసారి తన అనుచరుడి కోసం హరీశ్ రంగంలోకి దిగారు. మరి ఈసారైనా ఆయన మాట చెల్లుబాటు అవుతుందో లేదోననే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి! ఏపీ తరహాలోనే […]
మరో వ్యూహంతో టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న నల్గొండను టార్గెట్ చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలందరికీ ఒకేసారి సమాధానం చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన.. ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించి, ప్రజల్లో టీఆర్ఎస్‌కు ప్రజాదరణ ఉందని కాంగ్రెస్‌కు తెలిసొచ్చేలా చేసేందుకు వ్యూహాత్మకంగా […]
రేవంత్ ని రెచ్చగొడుతున్న కేసీఆర్… కారణం అదే
తెలంగాణ టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఈమధ్య చాలా సైలెంట్ అయిపోయారు. మునుపటి స్థాయిలో దూకుడును ప్రదర్శించడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం లేదు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు స్నేహభావంతో మెలగడంతో రేవంత్ సైలెంట్ అయిపోయారనేది వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ రేవంత్ పేరు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆయన మరో కేసులో ఇరుక్కున్నారు. అయితే దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి… […]
టీఆర్ఎస్ లో కొత్త ముసలం.. కెసిఆర్ పై ఫైర్ అయ్యిన మంత్రులు
తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేషన్లకు చైర్మన్లను భర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మన్లలో 5 గురు మైనార్టీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. అయితే ఈ నియామకాల పట్ల టీఆర్ఎస్‌లో పెద్ద ముసలం మొదలైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం కష్టపడని వారితో పాటు అనామకులకు పదవులు కట్టబెట్టారని ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన వారంతా తీవ్రస్థాయిలో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రులైతే ఏకంగా […]
కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు
కేసీఆర్ దూకుడు పెంచారు. తనపై విపక్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేపథ్యంలో మరింత చురుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సహా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే సమయంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్-బి(బిఫోర్)ను అమలు చేయాలని చూస్తున్నారట. వాస్తవానికి తెలంగాణలో 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. […]
అందరి లెక్క సరిజేస్తున్న కేసీఆర్
తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అందరి లెక్కలు సరిచేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో… టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా.. మార్చడంతోపాటు.. అన్ని వర్గాలను పార్టీ వైపే ఉండేలా చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. కేసీఆర్ క్యాస్ట్ ఈక్వెషన్స్ గురించి తెలిసిన వారు `ఔరా` అనక మానరంటే అతిశయోక్తి కాదేమో!! కమ్మ, రెడ్డి, బీసీ, బ్రాహ్మణ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ ఇలా […]
ఒక్క ఎత్తుతో ప్రజలను మార్చేసిన కేసీఆర్…అవాక్కయ్యే ప్లాన్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా రాజకీయ ఎత్తులు, జిమ్మిక్కలు ఎవరికీ పెద్దగా తెలియదంటే.. పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన వ్యవహరించిన శైలే దీనికి నిదర్శనం. అప్పట్లో రాష్ట్ర సాధనే లక్ష్యంగా అనేక హామీలు గుప్పించారు. తెలంగాణ సాధిస్తే.. ఎస్పీలనే సీఎంని చేస్తానని, అవసరమైతే కాంగ్రెస్ తో చెలిమి చేస్తానని, పార్టీని కూడా విలీనం చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాగోలా ఏరు దాటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. సీన్ కట్ […]
ఎమ్మెల్యే ఎంపీ మధ్య పవర్ పోరు
జిల్లాల పునర్విభజన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒకరికి పట్టున్న ప్రాంతం మరో జిల్లాలోకి వెళిపోవడంతో ఇప్పుడు నేతలు `పవర్` లేక విలవిల్లాడుతున్నారు. ఆ ప్రాంతం వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోయినా.. ఆ ప్రాంతంలో పట్టుకోసం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డికి మధ్య గ్యాప్ సృష్టిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రంగారెడ్డి జిల్లాలో ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో ఎవరిని అదుపు చేయాలో తెలియక టీఆర్ఎస్ అధినేత […]