అమిత్ మ్యాజిక్ ఇక్క‌డ ప‌ని చేస్తుందా..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించిన అనంత‌రం.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొల్పుతోంది. ముఖ్యంగా షా త‌దుప‌రి ల‌క్ష్యం తెలంగాణ అని ఇప్ప‌టికే సంకేతాలు వెలువ‌డిన నేప‌థ్యంలో.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారని అంద‌రూ ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ‌లో బ‌ల‌మైన నాయకుడిగా మారిన కేసీఆర్‌ను.. షా ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారు? మ‌రి అంద‌రిలానే అమిత్ షా వ‌ల‌లో కేసీఆర్ చిక్కుతాడా? అనే […]

యూపీ ఎఫెక్ట్‌: తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు

యూపీ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల‌పై ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ ఇప్పుడు దేశమంతా మొద‌లైంది. ప్ర‌ధాని మోదీని ఢీ కొట్ట‌డం ఇక అసాధ్య‌మ‌న్న విష‌యం ఈ ఫ‌లితాల‌తో తేలిపోయింది. అందుకే ఇప్ప‌టినుంచే త‌మ వ్యూహాలు మార్చుకోవ‌డానికి సిద్ధ‌మవుతున్నారు నాయ‌కులు. ముఖ్యంగా దూర‌దృష్టిగ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఇప్పుడు యూపీ ప్ర‌భావం ప‌డింది. అందుకే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మోదీ హవా.. తెలంగాణ రాష్ట్రంపై ప‌డ‌కుండా ఉండేందుకు ప‌క్కా వ్యూహంతో దూసుకుపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహానికి […]

మోదీ-షా త‌దుప‌రి ల‌క్ష్యం కేసీఆరేనా?

`నెక్ట్స్ ఏంటి?` ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతోంది. కాషాయ ద‌ళం ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని.. త‌మ త‌దుప‌రి ల‌క్ష్యంగా చేసుకుంటోంది? ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత‌.. ఆ పార్టీ అధ్య‌క్షుడు ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు? అని అన్ని రాష్ట్రాల నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు! అయితే త‌దుప‌రి ల‌క్ష్యాన్ని కూడా బీజేపీ సెట్ చేసుకుంద‌ట‌. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డేందుకు వీలుగా ఉన్న తెలంగాణ‌ను ఇప్పుడు త‌మ టార్గెట్‌గా ఎంచుకుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల‌కు అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన […]

ఇక మోడీకీ బాబు స‌రెండ‌ర్ కావాల్సిందేనా?  

ప్ర‌ధాని మోడీ.. సూప‌ర్ హీరో అయిపోయారు! ఉత్తర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం సృష్టించి తిరుగులేని నేత‌గా అవ‌తరించారు. అంత‌కంత‌కూ త‌న బ‌లాన్ని కూడ‌గ‌ట్టుకుని శ‌క్తిగా మారుతున్నారు. మెడీ బ‌ల‌ప‌డ‌టం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కూ మింగుడు ప‌డ‌ని అంశ‌మే! పైకి అభినంద‌న‌లు చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం టెన్ష‌న్ మాత్రం పెరుగుతోంద‌ట‌. ముఖ్యంగా మోడీ వ్య‌వ‌హార శైలి నాయ‌కులంద‌రికంటే చాలా భిన్నం! ఎప్పుడూ డిమాండ్ చేస్తే అస్స‌లు ప‌నులు జ‌ర‌గ‌వు! ఓన్లీ రిక్వెస్ట్‌లే!! అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క‌.. ఈ […]

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు `మార్కుల` టెన్ష‌న్‌

ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగా వారికి ర్యాంకులు ప్ర‌క‌టిస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు! ఇప్పుడు ఇలాంటి స‌ర్వేనే తెలంగాణ‌లోనూ నిర్వ‌హించారు సీఎం కేసీఆర్‌! ఇప్పుడు ఈ స‌ర్వే, ర్యాంకులే హాట్ టాపిక్‌గా మారాయి! కేవ‌లం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా.. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ స‌ర్వే జ‌ర‌గ‌డంతో అంతా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. అంతేగాక త‌మ‌కు ఎన్ని `మార్కులు` వ‌చ్చాయో తెలియ‌క‌.. ఎమ్మెల్యేలు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎక్కువ వ‌చ్చిన వారికి […]

కొమ్ములు పెరిగాయ్‌…ఎమ్మెల్యేకు కేసీఆర్ వార్నింగ్‌

పనితీరు మెరుగుప‌రుచుకోవాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేల‌కు ప‌దే ప‌దే చెబుతుంటారు. ఈ విష‌యంలో త‌న‌కు ఆప్తులైన వారు ఉన్నా.. వారిపై కూడా ఎంతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు! ఇప్పుడు ఇదే విష‌యం మ‌రోసారి రుజువైంది. త‌న‌కు ఆప్తుడైనా స‌రే.. ఒక ఎమ్మెల్యేపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ ఆయ్యారు. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. `నీకు కొమ్ములు పెరిగాయి` అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో హెచ్చ‌రించారు. తాను అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో ఆ ఎమ్మెల్యే ప‌నితీరు అస్స‌లు బాగాలేద‌ని […]

తెలంగాణ మంత్రులు & ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీట్లు మార్కులివే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం టీఆర్ఎస్ఎల్సీ మీటింగ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఇప్ప‌టికే పార్టీ ప‌రంగాను, ప్ర‌భుత్వంలోనే జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోన్న కేసీఆర్ మంత్రుల‌తో పాటు తెలంగాణ‌లో టోట‌ల్ ఎమ్మెల్యేలంద‌రి మీద చేయించిన స‌ర్వే లిస్టును వారికి అంద‌జేశారు. ఇక వచ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఏకంగా 101 -106 సీట్లు వ‌స్తాయ‌ని కేసీఆర్ సర్వేలో స్ప‌ష్ట‌మైంద‌ట‌. స‌ర్వేల్లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌వైపే ఉన్న‌ట్టు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశార‌ట‌. ఇక నియోజకవర్గాల వారీగా […]

ఇరు రాష్ట్రాల చంద్రుల‌కు హ్యాప్పీ న్యూస్

జంప్ జిలానీల‌కు సీట్లు ఎలా స‌ర్దుబాటు చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచితే ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ హామీతో ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలు చేరిపోయారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే ఇక రెండు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేగ‌డం ఖాయం! అయితే ఇప్పుడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపున‌కు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం స‌మాచారాన్ని పంపాల‌ని ఇరు రాష్ట్రాల‌కు […]

తెలంగాణ కాంగ్రెస్‌ని బ‌తికించిన తాండూర్!

తెలంగాణ‌లో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా తాండూర్ జీవం పోసింది! కాంగ్రెస్ నేత‌ల్లో వాడిపోయిన ఆశ‌ల‌ను చిగురించేలా చేసింది. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తాండూరులో కాంగ్రెస్ జైత్ర‌యాత్ర కొన‌సాగించింది. ఇది ఒక ర‌కంగా కాంగ్రెస్‌కి ఊపురులూదితే.. అధికార టీఆర్ ఎస్‌లో మాత్రం నైరాశ్యం నింపింది. తాజా ప‌రిణామాల‌తో కాంగ్రెస్ నేత‌లు మాంచి జోష్ మీదున్నారు. 2014 ఎన్నిక‌ల్లో.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఘోరంగా సీట్లు కోల్పోయింది. చివ‌ర‌కి బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన కార్తీక్ […]