సిట్టింగులకు సీట్లు..ఎమ్మెల్యేలపై జగన్ సడన్ ప్రేమ..!

పనితీరు సరిగ్గా లేకపోతే ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి తనని ఏం అనుకోవద్దు అని చెప్పి ఇదివరకు జరిగిన వర్క్ షాపుల్లో జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా వార్నింగ్ ఇచ్చిన జగన్..తాజా వర్క్ షాపులో పూర్తిగా రివర్స్ లో మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే తనకు కోపం లేదని, అత్యంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలెవరినీ పోగొట్టుకోవడం ఇష్టం లేదని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నదే తన అభిమతమని, […]

తాడికొండలో మరో ట్విస్ట్..శ్రీదేవికి క్లారిటీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా ప్రజా వ్యతిరేకత ఎదురుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే..డౌట్ లేకుండా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని చెప్పవచ్చు. అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో శ్రీదేవి త్వరగా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అక్కడ ప్రజా సమస్యలని గాలికొదిలేయడం..అందుబాటులో లేకపోవడం..ఇంకా పలు వివాదాల్లో ఉండటం వల్ల శ్రీదేవికి పెద్ద మైనస్ అయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండలో శ్రీదేవికి సీటు ఇస్తే డౌట్ లేకుండా ఓడిపోతారని సర్వేలు కొడై కూశాయి. దీంతో జగన్ వెంటనే […]

మైలవరంలో తగ్గని టెన్షన్..జగన్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికి?

గత కొన్ని రోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య పోరు ఎక్కువగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో  నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడం, సీటు మాదే అంటే మాది అని గొడవ పడుతున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకున్న సరే పోరు సద్దుమనగలేదు. దీంతో డైరక్ట్ జగన్ వద్దకు మైలవరం పంచాయితీ వెళ్లింది. ఈ క్రమంలోనే తాజాగా […]

ఏపీలో బీఆర్ఎస్..వైసీపీ ప్లాన్ అదే..!

బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు..తెలంగాణకే పరిమితమైన పార్టీని పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు. అటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తారు. అయితే మొదట ఏపీపై ఫోకస్ చేశారు..అక్కడ పార్టీ ఆఫీసు పెట్టడానికి స్థలాన్ని కూడా చూస్తున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెడితే..దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. అలాగే జగన్..కేసీఆర్‌కు ఎంతవరకు సహకరిస్తారనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎలాగో జగన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. […]

జ‌గ‌న్‌కు ఇది పెద్ద మైన‌స్సేనా… ఏం చెపుతారో ?

ఏపీకి.. ఇప్పుడు ఇదో పెద్ద మైన‌స్ అంటున్నారు మేధావులు. ఏపీని అన్నివిధాలా ముందుకు తీసుకువె ళ్తున్నాం.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్న సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు గ‌ట్టి దెబ్బే త‌గిలింది. మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, వినియోగంలో ఏపీ దేశంలోనేముందుంద‌ని కేంద్రం కుండ‌బ ద్ద‌లు కొట్టింది. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్టు పేర్కొంది. అయితే.. దీనిని అధికార పార్టీ నాయ‌కులు లైట్ తీసుకునే అవ‌కాశం ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు ఉన్న‌ప్పుడు […]

ఎమ్మెల్యేలపై సీక్రెట్ ఫోకస్..అదే డౌట్‌తో..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని కాబట్టి ప్రజలందరి మద్ధతు ఉంటుందని, కాబట్టి 175 సీట్లు ఎందుకు గెలవకూడదో అని చెప్పి తమ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఎప్పుడు క్లాస్ పీకుతూనే ఉన్నారు. అయితే జగన్ చెప్పిన టార్గెట్ సాధ్యమయ్యేదేనా అంటే..ఈ మాత్రం సాధ్యం కాని టార్గెట్. కాకపోతే 175 టార్గెట్ పెట్టం కదా..కనీసం 100 సీట్లు అయిన గెలిచి […]

బీసీ జపం..జగన్ సక్సెస్ అయినట్లేనా.!

అధికార వైసీపీ ఇటీవల బీసీల జపం ఎక్కువ చేస్తుంది..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటినుంచే కులాల వారీగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ప్రతి వర్గం టీడీపీకి యాంటీగా మారడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాలని టార్గెట్ చేశారు. తాజాగా జయహో బీసీ సభని కూడా నిర్వహించారు. అయితే ఈ సభ  ద్వారా..బీసీలకు తామే ఎక్కువ చేశామని, చంద్రబాబు ఏమి చేయలేదని, బాబు బీసీలకు అన్యాయం చేశారని జగన్ చెప్పుకొచ్చారు. బీసీలంటే […]

‘బీసీ’ పాలిటిక్స్..వైసీపీ ఎత్తులు ఫలించేనా..!

ఎన్నికలు దగ్గరకొస్తే చాలు..అన్నీ పార్టీలకు బీసీ వర్గాలు గుర్తొస్తాయి. ఎందుకంటే బీసీల ఓట్లే ఎక్కువ కాబట్టి. వారు వన్ సైడ్ గా ఓట్లు వేస్తే..గెలుపు ఈజీ. అందుకే బీసీలని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు మళ్ళీ రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. అయితే గత ఎన్నికల ముందు బీసీలని వైసీపీ బాగానే ఆకర్షించింది. మెజారిటీ బీసీల ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా బీసీల ఓట్లు దక్కించుకునేందుకు వైసీపీ […]

ముందస్తుకు జగన్..కన్ఫామ్ చేసిన మంత్రి!

ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు పూర్తిగా పికప్ కాకముందే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, 2023 మార్చి-జూన్ లోపు ప్రభుత్వాన్ని రద్దు చేసి..2023 సెప్టెంబర్-డిసెంబర్ లోపు ఎన్నికలు జరిగేలా చూసుకుంటారని ప్రచారం వస్తుంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా సమాచారం వెళ్ళినట్లు తెలిసింది. ఇప్పటికే బూత్ ఇంచార్జ్‌లని డీటైల్స్ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యేలు కొందరు […]