వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయనే చెప్పాలి. కనిపించిన ప్రతిదానికి వైసీపీ రంగు వేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రతిచోటా జగన్ బొమ్మ ఉండేలా చూసుకున్నారు. ఆఖరికి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల డాక్యుమెంట్లపై, పట్టాదార్ పాస్‌బుక్‌లపై కూడా జగన్ బొమ్మ వేశారు. ఇలా ప్రతి దానిపై జగన్ బొమ్మ కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రతి ఇంటికి జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్‌ని అంటిస్తూ వస్తున్నారు. అది కూడా జగనన్నే మా […]
Tag: Jagan
‘మా నమ్మకం నువ్వే జగన్’..జనం అనుకుంటున్నారా?
ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అయితే పూర్తిగా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడి ఆయన ముందుకెళుతున్నారు. అవే తమని గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేని గడపగడపకు పంపించి..పథకాల లబ్దిదారులతో మాట్లాడిస్తున్నారు. ఇక పథకాల ద్వారా ఇంత లబ్ది జరిగిందని ప్రజలకు చెబుతున్నారు. ఇక గడపగడపకు తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే పథకాలు అందిన ఇళ్లకు వెళ్ళి..వాళ్ళ ఇంటికి […]
వై నాట్ పులివెందుల..కుప్పంలో లక్ష మెజారిటీ..సాధ్యమేనా?
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో వై నాట్ గోల ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజలకు అంతా మంచే చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని..వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. అయితే జగన్ కు కౌంటరుగా చంద్రబాబు కూడా […]
జగన్ ‘పేద’ కాన్సెప్ట్..మీడియా కూడా లేదే..వర్కౌట్ అవుతుందా?
ఈ మధ్య జగన్ పదే పదే ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకునే విషయంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అంటే వారు విడిగా పోటీ చేస్తే తమకు లాభమనేది జగన్ కాన్సెప్ట్. ఎలాగో పొత్తు పోయేలా లేదు. ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. అందుకే జగన్ వేరే రూట్ లో వస్తున్నారు. తాను ఒంటరిగా […]
వై నాట్ పులివెందుల..బాబు రివర్స్ కౌంటర్.. వర్కౌట్ అవుతుందా?
వచ్చే ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకుని అధికారం దక్కించుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ..మరొకసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇటు టిడిపి ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో రెండు పార్టీలు ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నాయి. జగన్ ఏమో వై నాట్ 175 అని నినాదంతో ముందుకెళుతూ..దమ్ముంటే టిడిపి 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. దానికి చంద్రబాబు […]
ఢిల్లీలో పవన్..మొన్న జగన్..కమలం ఎత్తులు!
ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోయినా..ఆ రాజకీయాలని అటు మార్చడంలో మాత్రం బిజేపికి ఆడే గేమ్ వేరుగా ఉందని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ రాజకీయాలని బిజేపి ప్రభావితం చేస్తుంది. పైగా రాష్ట్రంలో అన్నీ పార్టీలు బిజేపి చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టిడిపి, జనసేన ఇలా ప్రధాన పార్టీలు బిజేపిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నాయి. ఇదే అడ్వాంటేజ్ గా బిజేపి..రాష్ట్ర రాజకీయాలతో ఆడేసుకుంటూ..తమకు కావల్సిన విధంగ రాజకీయం నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ నేతలతో […]
జగన్ సెంటిమెంట్..ఎమ్మెల్యేలు తగ్గినట్లే..ముందస్తుపైనే డౌట్!
ఏ పరిస్తితులోనైనా సెంటిమెంట్ రాజేసి..ఆ పరిస్తితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జగన్ ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. వరుసగా ఆయన చేస్తున్న రాజకీయం చూస్తే అదే కనిపిస్తుంది..ఎప్పుడు ఎదోక సందర్భంగా సెంటిమెంట్ రాజేయకుండా ఉండటం కష్టం. గత ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తాను పేదల మనిషిని అని, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, తనకు ప్రజలకు అండగా ఉండాలని అంటున్నారు. అదే సమయంలో తనపై కొంతమేర అసంతృప్తిగా ఉన్న సొంత ఎమ్మెల్యేలని సైతం సెంటిమెంట్ […]
ఎమ్మెల్యేలకు క్లాస్ లేదా? జగన్ కొత్త రూట్‌లో!
ఇప్పటివరకు వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి..కానీ ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం…అనూహ్యంగా ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి గెలవడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో..తాజాగా జగన్ పెట్టే వర్క్ షాప్ ఏ విధంగా సాగుతుందనే చర్చ అందరిలో సాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన వర్క్ షాపులు వేరు..ఇప్పుడు జరిగేది వేరు. గత ఏడాది జరిగిన వర్క్ షాపులో జగన్ పదే పదే ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తూ […]
మంత్రివర్గంలో మార్పులు…ఆ నలుగురు అవుట్?
ఏపీలో మరోసారి మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్..పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టి వారి స్థానాల్లో కీలక నేతలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని తప్పించి..చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]