సబితా ఇంద్రారెడ్డి ప్లాన్…హైకమాండ్ ఒప్పుకుంటుందా ?

మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రాజ‌కీయంగా పెద్ద యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌బితా టీ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కుల దూకుడు ముందు పెద్ద‌గా ప్ర‌చారంలోకి రావ‌డం లేదు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న ఆమె ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు టీ కాంగ్రెస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2009 ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హోం మంత్రి అయిన స‌బితా […]

వైసీపీలోకి సీనియర్.. అమ‌రావ‌తిలో టీడీపీకి ఇబ్బందే!

విప‌క్షం వైసీపీకి రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో గ‌ట్టి ప‌ట్టు దొరుకుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప్రాంతంలో పార్టీని ముందుండి న‌డిపించ‌గ‌ల నేత వ‌స్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వ‌స్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌తంలో సెంట్ర‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన మ‌ల్లాది విష్ణు ఇప్పుడు జ‌గ‌న్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని రెండు మూడు రోజులుగా […]

టీకాంగ్రెస్‌లో మూడు ముక్క‌లాట‌

విభ‌జ‌న తర్వాత ఏపీలో పూర్తిగా దెబ్బ‌తిన్నా.. తెలంగాణ‌లో మాత్రం కాంగ్రెస్ పున‌ర్వైభ‌వం కోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద చిక్కొచ్చి ప‌డింది. ఉన్న నేత‌లంద‌రూ సీఎం పీఠంపై క‌న్నేసి.. లాబీయింగ్‌కు కూడా తెర‌లేపారు. ఎవ‌రికి వారు తామే సీఎం అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించేసుకుంటున్నారు. స‌ర్వేలు చేయించేస్తున్నారు. తన కంటే జూనియ‌ర్లు సీఎం కుర్చీ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంటే.. నేనెందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దు అనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఈ రేసులోకి […]

టార్గెట్ జ‌గ‌న్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ను, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని విడదీసి చూడ‌లేం! అంత‌లా కాంగ్రెస్‌ను త‌న‌లో ఐక్యం చేసేసుకున్నాయాన‌! ఆయ‌న మ‌ర‌ణం తర్వాత వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర రాజ‌కీయాల్లోకి రావ‌డం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జ‌గ‌న్ వైపు వెళ్లిపోవ‌డం.. ఇదే స‌మయంలో విభ‌జ‌న జ‌ర‌గ‌డం.. ఇలా దెబ్బ మీద దెబ్బ త‌గ‌లడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి కొంతైనా పుంజుకోవాల‌ని పార్టీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇదే స‌మ‌యంలో వైఎస్ పేరు చెప్పి.. త‌మ […]

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

కేసీఆర్ కంచుకోట‌లో రాహుల్ పోటీ..!

తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్ట‌డం అక్క‌డి రాజ‌కీయ ప‌క్షాల వ‌ల్ల అయ్యేలా లేదు. బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ చేతులెత్తేయ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ముగ్గురు నాయ‌కులు, ఆరు గ్రూపుల‌తో విల‌విల్లాడుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కుతుందా ? అన్న సందేహాలే అంద‌రికి క‌లుగుతున్నాయి. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు సూప‌ర్ బూస్ట‌ప్ ఇచ్చే […]

ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయి. తొలుత ఏక‌గ్రీవం చేయాల‌ని బీజ‌పీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు సైతం అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో పోటీ అనివార్య‌మైపోయింది. ద‌ళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్‌డీఏ బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా మ‌తిపోయింది. ఇంత‌లోనే తేరుకుని, ఆయ‌నకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉంద‌ని, కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే మాజీ […]

కొత్త టార్గెట్‌: ముందు జ‌గ‌న్‌.. త‌ర్వాత చంద్ర‌బాబు

అధికార పార్టీ నాయ‌కులు చేసే అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే.. ప్ర‌తిప‌క్షానికైనా, ఇత‌ర పార్టీల‌కైనా మ‌నుగ‌డ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బ‌లం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌స్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీఅయ్యాయ‌ట‌. దీని వెనుక బ‌ల‌మైన […]

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రాజకీయాల్లో జేజ‌మ్మ కాక రేపుతోందిగా..

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు వీక్ అవుతోంది. వాస్త‌వంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మీద ఇప్పుడిప్పుడే వ్య‌తిరేక‌త స్టార్ట్ అవుతోంది. అయితే దీనిని క్యాష్ చేసుకోవ‌డంలో టీ కాంగ్రెస్ నాయ‌కులు ఘోరంగా ఫెయిల్ అవుతున్నార‌న్న‌ది రాజ‌కీయవ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న చ‌ర్చ‌. టీ కాంగ్రెస్‌లో ఉద్దండులైన నాయ‌కులు చాలా మందే ఉన్నారు. అయితే వీరంతా ప్ర‌జ‌ల ప‌క్షాన‌, ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి, ఆలూ లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమ‌లింగం అన్న చందంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌కుండానే […]