హెరిటేజ్ కి ఆ దూకుడు ఎందుకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌. పాలు పాల ఉత్ప‌త్తులు స‌హా రిటైల్ బిజినెస్ చేసే హెరిటేజ్ ఇప్పుడు మంచి ఊపుమీద ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. హెరిటేజ్ షేర్లు ఈ నెల సెకండ్ వీక్‌లో అమాంతం ఆకాశానికి దూసుకుపోయింది. హెరిటేజ్ షేర్ బుధవారం రూ.888 వద్ద క్లోజ్ అయింది. ఈ మ‌ధ్య కాలంలో ఇంత మొత్తంలో కోట్ కావ‌డం ఇదే తొలిసార‌ని మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. అయితే, గ‌తంలో హెరిటేజ్ షేర్‌కు […]

బాబు ఈ డ‌బ్బులు ఏ మూల‌కు ..?

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. పోల‌వ‌రానికి కేంద్రం ఇబ్బడి ముబ్బ‌డిగా నిధులు ఇస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది తీసుకుంటామ‌ని, రావాల్సిన‌వి అడుగుతామ‌ని ఆయ‌న పేర్కొటూ.. ప్యాకేజీకి రెడ్ కార్పెట్ ప‌రిచారు. అయితే, ఈ ప్యాకేజీలోగుట్టు స్టోరీ ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతోంది. తాజాగా వ‌స్తున్న మీడియా క‌థ‌నాల ప్ర‌కారం కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీ ఏపీకి ఏమూల‌కూ స‌రిపోద‌నే కాకుండా.. ప్యాకేజీ పేరుతో కేంద్రం పెద్ద కుచ్చుటోపీనే పెట్టింద‌ని స‌మాచారం. నిధులు […]

టీడీపీని ఖాళీ చేసే ప‌నిలో బీజేపీ

మిత్రధ‌ర్మాన్ని బీజేపీ ప‌క్క‌న పెట్ట‌బోతోందా? ఇక సొంతంగా తెలంగాణ‌లో ఎదిగేందుకు పావులు సిద్ధంచేస్తోందా?  విమోచ‌న దినాన్ని బీజేపీ అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌డం వెనుక అస‌లు వ్యూహం ఏమిటి?  టీడీపీ, కాంగ్రెస్‌లు ఢీలా ప‌డిపోయిన స‌మ‌యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ఆ పార్టీకి ఎంత వ‌ర‌కూ మైలేజ్ తీసుకొచ్చింది? ఇదే స‌మ‌యంలో టీడీపీని ఖాళీ చేసే ప‌నిలో బీజేపీ ప‌డిందా?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు అందరిలోనూ మెదులుతున్నాయి! తెలంగాణ‌లో ప్ర‌ధాని మోడీ తొలి ప‌ర్య‌ట‌న సూప‌ర్ […]

చంద్ర‌బాబుకు అక్క‌డ చుక్క‌లే

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో అపార రాజ‌కీయ‌ అనుభ‌వ‌మున్న నేత ఎవ‌రంటే గుర్తొచ్చే తొలిపేరు చంద్ర‌బాబు! రాజ‌కీయ వ్యూహాలు ర‌చించి ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేయ‌డంలో అయ‌న‌కు మించిన నేత లేరు! మరి అలాంటి ఆయ‌న‌కే ఒక జిల్లాలో రాజ‌కీయాలు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌. ఆ జిల్లాలో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని అనుకున్న కొద్దీ.. ఇంకా ఇంకా ప‌రిస్థితులు దిగ‌జారిపోతున్నాయ‌ట‌. ముఖ్యంగా సొంత‌ పార్టీలోని వ‌ర్గ రాజ‌కీయాలే ఇందుకు కార‌ణ‌మని ప‌రిస్థితులు తేట‌తెల్లం చేస్తున్నాయి. స్వ‌యంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగినా ప‌రిస్థితి మార‌లేదంటే […]

మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]

టీడీపీ ఎవరికోసం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా విషయం పై రగిలిపోతుంటే అధికార టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన అతి పెద్ద సమస్య ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు జరుగుతున్న శాసనసభలో దానికి మించిన సమస్య ఇంకేమిలేదు అయితే దానిగురించి చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే ఎందుకు అధికార టీడీపీ జరిపించటం లేదు? ప్రత్యేకహోదాకంటే పెద్ద సమస్య ఇంకేమైనా ఉందా? ప్రత్యేక హోదా ఎమన్నా ప్రతిపక్ష […]

ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]

ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]

యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లీగల్‌ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్‌ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్‌ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్‌ లేకపోయినా, లాజిక్‌ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]