ఏపీ సీఎం చంద్రబాబు సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎప్పటికప్పుడు తన మంత్రులు, ఎమ్మెల్యేల మీద సర్వేలు చేస్తూ వారిని అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు. బాబు గారి సర్వే లెక్కలతో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడు ఏం కొంప ముంచుకొస్తుందోరా బాబు అని టెన్షన్ టెన్షన్‌గానే ఉంటున్నారు. ఇక తాజాగా విజయవాడకు సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌లకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు […]
Tag: chandra babu
టీడీపీ అధ్యక్షుడికి చంద్రబాబు హ్యాండ్
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావుకు ఎదురవుతున్న వింత పరిస్థితి… బహుశా మరెవ్వరికీ అనుభవంలోకి వచ్చి ఉండదు. పార్టీకి ఆయన అత్యంత విధేయుడు. ఈ విషయంలో ఎవరికీ ఏవిధమైన అనుమానాలూ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో ఆయనా ఒకరు. ప్రస్తుతం కళావెంకట్రావు.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఇన్ని అర్హతలున్నా ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంటూ ఊరిస్తోంది. చంద్రబాబు తాజాగా చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో […]
ఏపీ టీడీపీ నేతల పూజలు ఎందుకో..!
ఇప్పుడు ఏపీలో ఏ ప్రముఖ దేవాలయంలో చూసినా.. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజమే! అయితే, వారు దేవుడి మీద భక్తి ఉండి వెళ్తున్నారా? లేక వాళ్ల మనసులో ఉన్న కోరిక తీర్చమని అడిగేందుకు వెళ్తున్నారా? లేక తమకున్న పదవీ గండం తప్పించమని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్కళ్లది ఒక్కో కోరిక అని చెప్పక తప్పదు. సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే, […]
జూనియర్‌ని చంద్రబాబు మళ్లీ చేరదీస్తున్నారా?
ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి, జూనియర్ ఎన్‌టీఆర్‌కి మధ్య సంబంధం కేవలం ఫ్యామిలీ పరంగానే పరిమితం కాలేదు. పొలిటికల్‌గా కూడా ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. నందమూరి వంశంలో చంద్రబాబుకు అండగా నిలబడిన వారిలో, చంద్రబాబు చేరదీసిన వారిలో హరికృష్ణ, బాలకృష్ణల తరం తర్వాత ఒక్క జూనియర్ మాత్రమే కనిపిస్తాడు. అదేవిధంగా జూనియర్‌కు ఓ మంచి సంబంధం చూసి, దగ్గరుండి వివాహం చేయించిన ఘనత అక్షరాలా చంద్రబాబుకే దక్కుతుంది. నార్నేవారి ఇంటి అమ్మాయిని […]
ఇంటిలిజెన్స్ సర్వేతో హడలెత్తుతున్న టీడీపీ!
ఏ విషయంపైనైనా వ్యక్తలపైనైనా సర్వే చేయించే సీఎం చంద్రబాబు ఆయా సర్వేల్లో వచ్చిన రిజల్ట్ ఆధారంగా కార్యచరణ రూపొందించుకుంటుంటారు. ఇప్పటి వరకు ఆయన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సహా సీఎంగా ఆయన పనితీరుపైనా సర్వే చేయించుకున్నారు. ఆయా రిజల్ట్స్‌ని బట్టి పనితీరును మెరుగు పరుచుకుని ప్రజల్లో ఇమేజ్ సంపాదించాలని బాబు ప్లాన్. అదే విధంగా త్వరలో రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? విజయం సాధిస్తామా లేదా? అనే కోణంలో […]
వంశీ నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం…బాబుకు కంప్లైంట్
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి కృష్ణాజిల్లా టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు ప్రధాన నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల తిరగి టీడీపీ సైకిలెక్కిన దేవినేని నెహ్రూ, ఇప్పటికే టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీల మధ్య ఇప్పుడు వివాదాల వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు వీరి మధ్య ఘర్షణలకు తావిచ్చేలానే ఉండడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ కి చెందిన సీనియర్ రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ నేత, […]
టీడీపీలో కూడా వెంకయ్యకు పదవి ఉందా
ఏంటి టైటిల్ చూసి డంగయ్యారా? కేంద్రం మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎప్పుడు కమలాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుని, పసుపు కండువా కప్పుకుని సైకిలెక్కారా? అని శూన్యంలోకి చూపులు సారించి మెదడుకు పని చెప్పారా? ఆన్సర్ దొరకలేదా? అయితే.. ఇది చదవండి.. రిజల్ట్ ఉంటుంది! స్టేట్ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే ప్రచారం సాగడం, ఎన్నికల హామీ నేపథ్యంలో అందరూ హోదాపై తెగ మనసు పెట్టుకున్నారు. ఇదే విషయంలో చంద్రబాబు […]
ఆ ఇద్దరికి బెర్త్ కన్‌ఫార్మా?
ఏపీ సీఎం చంద్రబాబు ఏ ముహూర్తాన తన కేబినెట్‌ను త్వరలోనే విస్తరించనున్నట్టు ప్రకటించారో కానీ.. అప్పటి నుంచి భారీ ఎత్తున ఆశావహులు సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అటు సోషల్ మీడియా సహా బ్లాగుల్లో అదుగదిగో.. బాబు కేబినెట్‌లో ఆయనకు సీటు ఖాయం. కాదు కాదు.. సామాజిక వర్గం లెక్కల ప్రకారం ఈయనకు ఖాయం.. అంటూ నిత్యం ఏదో వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. అలాగే, ఇప్పుడున్న మంత్రుల్లో వారి వారి పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా కొందరిని […]
జగన్ సవాల్‌కు బాబు స్పందిస్తాడా..!
ఎప్పటికప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జగన్ తాజాగా మరో సవాలు విసిరారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని.. జనం ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకుందామని అన్నారు. అంతటితో ఆగకుండా.. పోలీసులు, ధనం, బలం, బలగం అంతా మీదగ్గరే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్రవాస ఆంధ్రులతో సాక్షి టీవీలో నిర్వహించిన లైవ్ షోలో జగన్ మాట్లాడారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని, అవినీతిలో కూరుకుపోయాడని ధ్వజమెత్తారు. తన […]