విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా

నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]

కేంద్రం నియోజ‌క‌వ‌ర్గాల‌ పెంపు…బాబుకి కొత్త జిల్లాల డిమాండ్

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం తెర‌పైకి వ‌చ్చింది. విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ప్ర‌తిపాద‌న అంశాన్ని కేంద్రం ప‌క్క‌న పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికే నియోజ‌క‌వ‌ర్గాలను పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తిక‌ర అంశం ఏంటంటే.. నియోజ‌క‌వ‌ర్గాలే గాక‌.. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉన్న 13 […]

ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్

ఒక్క విజ‌యం ఎంతోమందికి స‌మాధానం చెబుతోంది. ఒక్క విజ‌యం ఎన్నో సందేహాలకు కార‌ణ‌మ‌వుతోంది. ఒక్క విజ‌యం.. నాయ‌కుడిని శ‌క్తిగా నిలిపింది!! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీ నాయ‌కులు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇప్పుడు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నారు. ఈ విజ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఏపీలో ప‌రిస్థితులు మాత్రం త‌ల‌కిందుల‌య్యాయి! 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీల‌ను ప్ర‌ధాని తుంగ‌లో తొక్కారు! ద‌క్షిణాదిలో ఏపీపై ప‌ట్టు సాధించాల‌ని.. రాష్ట్రానికి […]

వైసీపీ టార్గెట్‌గా చంద్ర‌బాబు వ్యూహం… ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి !

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో తొలిసారి జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌కు అధికార టీడీపీ ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత‌ల ఎత్తుల‌ను అంతేస్థాయిలో చిత్తు చేసేలా వ్యూహం ర‌చిస్తోంది. సుమారు రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌యిన నేప‌థ్యంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తే అవ‌కాశం ఉంది. ఉద్దానం కిడ్నీ మ‌ర‌ణాలు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆక్వాపార్కు త‌దిత‌ర ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబును ఇరుకున పెట్టేందుకు జ‌గ‌న్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసింది. దీనికితోడు రోజా విష‌యం […]

ఇక మోడీకీ బాబు స‌రెండ‌ర్ కావాల్సిందేనా?  

ప్ర‌ధాని మోడీ.. సూప‌ర్ హీరో అయిపోయారు! ఉత్తర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం సృష్టించి తిరుగులేని నేత‌గా అవ‌తరించారు. అంత‌కంత‌కూ త‌న బ‌లాన్ని కూడ‌గ‌ట్టుకుని శ‌క్తిగా మారుతున్నారు. మెడీ బ‌ల‌ప‌డ‌టం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కూ మింగుడు ప‌డ‌ని అంశ‌మే! పైకి అభినంద‌న‌లు చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం టెన్ష‌న్ మాత్రం పెరుగుతోంద‌ట‌. ముఖ్యంగా మోడీ వ్య‌వ‌హార శైలి నాయ‌కులంద‌రికంటే చాలా భిన్నం! ఎప్పుడూ డిమాండ్ చేస్తే అస్స‌లు ప‌నులు జ‌ర‌గ‌వు! ఓన్లీ రిక్వెస్ట్‌లే!! అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క‌.. ఈ […]

సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే

స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ […]

క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో బాబుకు బ్రేక్ వేస్తోందెవ‌రు..!

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ అంశం దాదాపు గ‌త యేడాది కాలంగా ఊరిస్తూ..ఊరిస్తూ వ‌స్తోంది. ఈ ఊరింపుకు త్వ‌ర‌లోనే ఓ ముగింపు రానుంద‌ని తెలుస్తోంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తులు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ విస్త‌ర‌ణ‌కు ఓ వ్య‌క్తి బ్రేకులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో చాలా ట్విస్టులు చోటు చేసుకుంటాయ‌ని…ఇది ఓ థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పించ‌డం ఖాయ‌మ‌న్న టాక్ న‌డుస్తోంది. విస్త‌ర‌ణ‌లో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్సీల‌తో పాటు జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు చోటు ద‌క్కుతుంద‌ని […]

రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై..! ఆ పోస్టు ద‌క్కేనా..!

టీడీపీ ఎంపీ రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నారు. త‌న చిర‌కాల కోరిక అయిన ఒక‌ ప‌ద‌వి కోసం ఇక ప్ర‌జా జీవితం నుంచి శాశ్వతంగా దూరం కాబోతున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా పేరు సంపాదించిన ఆయ‌న‌.. ఇక 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కావాలు దాదాపు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు న‌రస‌న్న పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు!! పార్టీలు మారినా.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఆయ‌న‌కు అంద‌ని ద్రాక్ష గానే మిగిలిపోతోంది. కానీ […]

బాబు మ‌ళ్లీ బొత్స గాడిలో ప‌డుతున్నారా?

అధికార పార్టీ నాయ‌కులు ఎంత‌మంది ఉన్నా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తిప‌క్షానికి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ మాటే చెల్లుబాటు అవుతోంది. విజ‌య‌న‌గ‌రంలో అధికార యంత్రాంగాన్నంతా త‌న చెప్పుచేతల్లో పెట్టుకుని చెల‌రేగుతున్నార‌ట‌. ఈ విష‌యం అధికార పార్టీ నేత‌ల‌కు తెలిసినా.. ఉదాసీన వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇదే సరైన స‌మ‌యంగా భావించి.. అధికార యంత్రాంగాన్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. అయితే తాను టీడీపీలో చేరిపోతానని సంకేతాలు ఇస్తూ ఇలా త‌న ప‌నుల‌న్నీ చ‌క్కబెట్టుకుంటున్నార‌ట‌. అయితే గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో బాబును […]