మిత్రపక్షమైన టీడీపీతో ఎప్పుడెప్పుడు విడిపోదామా? అని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు! కలహాల కాపురం చేయలేమని చెబుతున్నా.. తప్పదు అన్న రీతిలో అధినాయకత్వం ఆదేశాలివ్వడంతో ఇక తప్పని పరిస్థితుల్లో కూటమిలో కొనసాగుతున్నారు! అయితే పెండింగ్‌లో ఉన్న మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేయనున్నాయా? ఇక టీడీపీ-బీజేపీ నేతలు ఎవరి దారి వారు చూసుకోబోతున్నారా? కలహాల కాపురానికి ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టి బరిలోకి దిగబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది! రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ […]
Tag: bjp
టీడీపీతోనే కయ్యానికి కాలుదువుతున్న బీజేపీ !
`తెలుగుదేశం పాలనలో అవినీతి తారస్థాయికి చేరింది..` ఇది నిత్యం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ! దీనిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నదే లేదు. కానీ ఇదే విమర్శ మిత్రపక్ష ఎమ్మెల్యే చేస్తే అది నిజంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశమే!! అలా ప్రభుత్వంపై విమర్శలు చేసి సంచలనం సృష్టించారు ఏపీ బీజేపీ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు! ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి భాగోతాన్ని బట్టబయలు […]
బీజేపీ లెక్క: హోదా కోసం ఫైటింగ్ వేస్ట్
ఏపీకి ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరో మలుపు తిరిగిందా? నిజానికి హోదా విషయంలో ఏపీకి అర్హత లేదా? విభజనతో ఎంతో నష్టపోయిన ఏపీకి అర్హత లేదుకాబట్టే.. ఇంతకాలం హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందా? అందుకే ఇప్పటి వరకు హోదా బదులు ప్యాకేజీతో సరిపెడతామని అంటోందా? అంటే.. ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. తాజాగా సోము హోదాపై స్పందించారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా.. ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? అని […]
హోదా పోరాటాన్ని తొక్కేస్తున్న టీడీపీ, బీజేపీ
హోదా ఇచ్చే వరకూ పోరాడదామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు హోదాతో ఒరిగేది ఏమీ లేదు ప్యాకేజీతోనే లాభమని ఫిరాయించారు!! హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలి అని పోరాడిన వెంకయ్య.. ఇప్పుడు ప్యాకేజీనే మంచిదంటూ నీతులు వల్లెవేస్తున్నారు!! హోదా అని ప్యాకేజీ ఇచ్చారేంటి? అని ప్రశ్నించేందుకు బాబు సిద్ధంగా లేరు! టీడీపీ ఎంపీలు, బీజేపీ నాయకులు ఏపీ ప్రజలకు పెట్టిన శఠగోపం గురించి మాట్లాడేందుకు నోరు మెదపడం లేదు! హోదా కోసం జరిగే పోరాటం పుంజుకుంటే […]
ప్యాకేజీ బండారం బయట పడుతోంది!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న తరుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్రబాబు సహా ఆయన మందీ మార్చలం పెద్ద ఎత్తున ప్రవచనాలు వల్లించారు. తీరా ప్యాకేజీ వచ్చి ఆరు మాసాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి హామీ కార్యరూపం దాల్చలేదు. సరికదా ప్యాకేజీకి చట్ట బద్ధత హుష్ కాకి అన్నచందంగానే మారిపోయింది. ఈ విషయంలో గడుసుగా మాట్లాడిన బీజేపీ నేత.. ఆర్థిక మంత్రి […]
టీడీపీ – బీజేపీ దాగుడుమూతల దండాకోరాట
ఏపీలో అధికార టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలోనే అటు కేంద్రంలోనూ టీడీపీతోనూ కలిసి నడుస్తోంది. దీంతో ఇటు రాష్ట్రంలో రెండు మంత్రుల స్థానాలు, అటు కేంద్రంలో రెండు స్థానాలు ఈ రెండు పార్టీలూ ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇరు పక్షాల నడుమ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అయితే, ఈ కెమిస్ట్రీ కొన్ని కొన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారట ఇరు పక్షాల నేతలు. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రం ఏమీ చేయడం లేదని టీడీపీ […]
ఎమ్మెల్యేలని కాల్చేయండి.. నక్సల్స్‌కి వీర్రాజు పిలుపు!
బీజేపీ ఎమ్మెల్సీ.. సోము వీర్రాజు ఉన్నట్టుండి మళ్లీ వార్తల్లో మెరిశారు. మెరుపు అంటే అలాంటి ఇలాంటి మెరుపు కాదన్నమాట! సంచలనం సృష్టించారు. నిన్న మొన్నటి వరకు అధికార టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి.. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన ఆయన తనకు బీజేపీ అధ్యక్ష పీఠం దక్కుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎందుకో ఆ అదృష్టం ఇప్పట్లో దక్కేలా కనిపించడంలేదు. దీంతో ఆయన ఇటీవల కొన్నాళ్లుగా మీడియాకు దూరం అయిపోయారు. అయితే, అనూహ్యంగా […]
టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కొత్త పేచీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలమైన జాతీయ పార్టీగా అవతరించాలని పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి సరికొత్త సమస్యలు అడ్డువస్తున్నాయి! 2014లో ఏపీలో చంద్రబాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. అదేవిధంగా మంత్రివర్గంలో రెండు సీట్లను సైతం కొట్టేసింది బీజేపీ. ఇక, ఇదే తరహాలో తెలంగాణలోనూ అధికార కేసీఆర్‌తో చెలిమి చేయడం ద్వారా లాభపడాలనేది కమల నాథుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కొందరు మాత్రం ఏపీ మాదిరిగా టీడీపీతో పొత్తు […]
లింగంపేట-మోర్తాడు మధ్య రైలు
గుర్తింపు కోరుకోని రాజకీయ నాయకులెవరుంటారు చెప్పండి! అసలే పార్టీల మధ్య, నాయకుల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న తరుణంలో.. ప్రజలకు ఉపయోగపడే ఏ చిన్న పని చేసినా ఆ క్రెడిట్ కొట్టేయడానికి నాయకులు తహతహలాడుతుంటారు. అయితే కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఆ క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారా? అని సందేహాలు ఇటీవల వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకంటే.. లింగంపేట- మోర్తాడు మధ్య రైలు ప్రారంభించిన క్రెడిట్ అటు బీజేపీకి దక్కకుండా చేసేందుకు ఎంపీ అనుచరులు ప్రయత్నిస్తున్నారట. […]