ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానున్నదో అనే అంశంపై స్పష్టత వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్‌పై కన్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కాషాయ పార్టీ […]
Tag: bjp
అక్కడ బీజేపీకి డిపాజిట్లు గల్లంతు..!
బీజేపీ అస్సాంలో విజయం దిశగా పరుగులు తీస్తున్నది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్యతను చాటుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాలకు ఎగబాకింది. అక్కడి అధికార టీఎంసీ పార్టీకి సవాల్‌గా నిలిచింది. ఇంతగా యావత్ భారతదేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చతికిలపడిపోయింది. డిపాజిట్లను కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారి పోయింది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడుస్థానంలో కొనసాగుతుండగా అక్కడ కేవలం 15వేల ఓట్లను మాత్రమే సాధించగలిగింది. […]
బెంగాల్‌లో ఓవైసీ పార్టీకి ఝలక్..!
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్నది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించలేకపోతున్నది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 292 స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలను నిర్వహించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా […]
ఓటమి దిశగా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మహమహులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇప్పటికే టీఎంసీ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. మొత్తంగా 161 స్థానాల్లో ముందంజలో ఉన్నది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మొత్తంగా ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో మొత్తంగా టీఎంసీ 51శాతం సాధించగా, 35శాతం ఓట్లను మాత్రమే సాధించడం గమనార్హం. ఇదిలా సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మూడు […]
అగ్రనటులు ముందజ.. ఖుష్బూ వెనుకంజ
ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయగా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సారథ్యంలోని కూటమి […]
తిరుపతి ఉప ఎన్నిక..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం!
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నేడు రానున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల […]
నందిగ్రామ్‌లో వెనకబడిన మమత..!
దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైనే ఉన్నాయి. అక్కడ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగాయి. బీజేపీ, టీఎంసీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య స్వల్ప సంఖ్యలోనే తేడాలు ఉండడంతో మరింత ఉత్కంఠత రేపుతున్నది. మొత్తంగా 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర కాక రేపుతున్నాయి. క్షణం క్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఆది నుంచి టీఎంసీ […]
తిరుపతి ఉప ఎన్నిక..షురూ అయిన కౌంటింగ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్నాయి. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]
ఈటలకు బీజేపీ అమిత్‌షా ఫోన్..?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపులకు తెరలేపారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని తన ఫామ్ హౌస్‌కే పరిమితమైన ఈటల అక్కడ తన నియోజకవర్గ అభిమానులతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. […]