పన్నీర్ వెంట టీడీపీ.. శశికళ వెంట వైకాపా!

త‌మిళ‌నాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జ‌రుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆక‌ర్షించింది. పురుట్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన త‌మిళ‌నాడు సీఎం సీటును ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా అమ్మ‌కు అత్యంత విధేయుడు, ఆద‌ర్శ‌ప్రాయుడు అయిన ప‌న్నీర్ సెల్వం త‌మిళ‌నాడుసీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే, ఈ సీటుపై క‌న్నేసిన శ‌శిక‌ళ‌.. ప‌న్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు త‌న‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించుకున్నారు. […]

చిన్నమ్మ జాతకాన్నిమార్చలేని జ్యోతిష్కులు

త‌మిళ‌నాట రాజ‌కీయ సింహాస‌నంపై కూర్చోవాల‌ని దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ త‌హ‌త‌హ‌లాడుతున్నారు! అప్పుడో ఎప్పుడో సీఎం అవుతార‌ని అన్నాడీఎంకే కార్య‌కర్త‌ల‌తో పాటు.. ప్ర‌జ‌లు కూడా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆగ‌మేఘాల మీద చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సీఎం పీఠం ఎక్కేందుకు శ‌శిక‌ళ ఎందుకు ఇంత తొంద‌ర‌ప‌డుతున్నారు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అంద‌రినీ తొలుస్తోంది! అయితే దీనికి  మ‌న్నార్ గుడి జ్యోతిషుల ప్రభావం అధికంగా ఉంద‌ని సమాచారం! రాజ‌కీయ నాయ‌కుల‌కు […]