ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!

ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్‌ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ […]

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ […]

రాజకోట(అమరావతి) రహస్యం తెలుసా?

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన వివరాలు లేకపోవడంతో దానిని ఛాలెంజ్‌ చేయాలని భావిస్తున్న ఇతర నిర్మాణ సంస్థలు ఆయోమయంలో పడుతున్నాయి. కీలక వివరాలు ఉండాల్సిన చోట చుక్కలు (డాట్స్‌) మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆర్థిక అంశాలకు సంబందించిన ముఖ్యమైన వివరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సింగపూర్‌ సంస్థలకే నిర్మాణ పనులను […]

ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ రాష్ట్రం మద్దతివ్వనుందట. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌, రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు (కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు)పై ఓటింగ్‌ జరిగితే, అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారమ్‌. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తితో టిఆర్‌ఎస్‌ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కేకే సానుకూలంగా స్పందించారట. ఆంద్రప్రదేశ్‌కి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారట. ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే […]

‘స్విస్‌’ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నారా?

రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు. ఆయన రాజకీయాల్లో ఉండగానే ఒకప్పటి తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోయింది. అలా విభజన జరగడానికి ఆయన కూడా ఓ కారణం. 23 జిల్లాల తెలుగు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రికార్డు సమయం ఏకధాటిగా పరిపాలించిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కింది. ఆయన ఇప్పుడు కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. పదేళ్ళు సమైక్య తెలుగు రాష్ట్రానికి ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే […]

కేవీపీకి టీడీపీ సపోర్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఊహించని మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే… దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా… పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా […]

ఏపీ సాధించింది 1st ర్యాంక్

ఇప్పటికే ఏపీకి దక్కాల్సిన పలు బెస్ట్ ర్యాంక్ లు దక్కకుండా పోతున్నాయని గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎట్టకేలకు ఊరటనిచ్చింది.అరుదైన అవార్డ్ ఏపీని వరించింది.ఇప్పటికే పెట్టుబడు,ఆకర్షణ,ఈజ్ అఫ్ డూయింగ్ బిసినెస్ వంటి వాటిలో తామే నంబర్ 1 అయినా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పోవడంపై కేంద్రంపై ఏపీ బాహాటంగానే తమ ఆక్రోశాన్ని,ఆవేదనను బయటపెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాల అమలులో వివిధ కేటగిరీల్లో ఇచ్చే అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. డిజిటైలేజేషన్ రంగంలో […]

కోడెల అడ్డంగా దొరికిపోయాడు!

కోరి తెచ్చుకున్న కోడెల కష్టాలు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నోటి దురుసుతో కోరి మరీ కష్టాల్ని కొనితెచ్చుకున్నారు.ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోడెల మాట్లాడారు.అందులో పోయిన ఎన్నికల్లో చేసిన వ్యయం గురించి ఆయన చెప్పిన మాటలు ఆయన మెడకే చుట్టుకున్నాయి.సదరు టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ కోడెల ఏమన్నారంటే ‘గడచిన ఎన్నికల్లో తన నియోజకవర్గం సత్తెనపల్లిలో రూ. 11.50 కోట్లు వ్యయమైంద’ని కోడెల చెప్పారు.అంతటితో ఆగకుండా అదే 1983లో జరిగిన […]

చంద్రబాబు నెంబర్ వన్ గేమ్ షో

అభివృద్ధి సంగతి దేవుడెరుగు,అంకెల గారడీయే ముఖ్యం అన్న చందాగా తయారయ్యింది చంద్రబాబు వెంపర్లాట చూస్తుంటే.ఏ సమీక్షలు జరిగినా,ఏ రంగంలో చూసినా నంబర్‌-1 స్థానంపైనే మాట్లాడుతున్నారు కానీ వాస్తవిక అభివృద్ధి,క్షేత్ర స్థాయిలో ఆ రంగ వాస్తవ అభివృద్ధి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించడం లేదన్నది వాస్తవం. కొద్దిరోజులుగా ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఈ నంబర్ గేమ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.దీనిపై అధికారులు సైతం విస్తుపోతున్నారు.ఈ అంకెల గారడీ అంతా వాస్తవానికి దూరంగా జరుగుతోంది.ఇక ఈ మధ్య బాగా చర్చనీయాంశం […]