ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు తన సొంత లాభం కొంత కూడా మానుకోవడం లేదని, ప్రజల ప్రయోజనాల కన్నా.. తన సొంత ప్రయోజనాలకే ఆయన పెద్ద పీట వేస్తున్నారట! ప్రస్తుతం దీనిపై అందరూ చర్చించు కుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనేక పరిశ్రమలు వెలిశాయి. ఇదే క్రమంలో ఉమ్మడిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్తరిస్తుందని అందరూ భావించారు. ఇదే క్రమంలో చంద్రబాబు […]
Category: Politics
ఆ ఏపీ మంత్రి నియోజకవర్గంలో కులాల చిచ్చు
సామాజిక వర్గాల ఆధిపత్యానికి ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు నియోజకవర్గం కేరాఫ్‌గా మారిందా? అక్కడ రావెల సామాజిక వర్గానికి చెందిన నేతలు సొంత పార్టీలోని ఇతర సామాజిక వర్గాలనే టార్గెట్ చేస్తున్నాయా? ఈ క్రమంలో మిగిలిన సామాజిక వర్గాల నేతలంగా ఇప్పుడు రావెలకు యాంటీగా మారబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో!! ఇక, విషయంలోకి వెళ్లిపోతే.. ఐఆర్‌టీఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు […]
ట్రంప్ దెబ్బకు భగ్గుమన్న బంగారం
అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచానికి తుమ్ములు వస్తాయన్న నానుడి మరోసారి రుజువైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయి. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ లీడర్‌గా అందరి దృష్టినీ ఆకర్షించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. సౌమ్యురాలు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ల మధ్య పోరు క్షణ క్షణానికి ఉత్కంఠగా మారుతోంది. నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యం తారుమారవుతోంది. డొనాల్డ్‌దే ఆధిక్యం అని అనుకున్న తదుపరి నిమిషంలోనే హిల్లరీ.. కాదు..కాదు.. హిల్లరీ […]
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ల విజయం
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అమెరికా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ప్రపంచమంతా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో తొలి నుంచి వివాస్పద వార్తలు చేస్తూ వస్తోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ మార్క్‌కు చేరువై అందరికి షాక్ ఇచ్చారు. మొత్తం 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 244 ఓట్లు సాధించారు. కాగా […]
కేసీఆర్ ఫీల్ గుడ్ స్టోరీ
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడు బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మరింత జోష్ పెంచేందుకు ఆయన రెడీ అయ్యారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతుండడం, పథకాలు, ప్రాజెక్టులు వంటివి పెద్ద ఎత్తున అమలు చేస్తుండడంతో ఆయన ఆయా విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన నిర్ణయించారు. మరోపక్క, కాంగ్రెస్ నేతలు చేస్తున్న యాంటీ ప్రచారం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున విసుగు తెప్పిస్తోంది. పథకాలు నత్తడకన సాగుతున్నాయని, ఆరోగ్య శ్రీవంటివి కుంటుపడుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. […]
జగన్ పోరాట పంథా మారిందా..?
రాజకీయంగా పవన్ గండాన్ని తప్పించుకునేందుకు ప్రత్యేక వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత జగన్.. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరులో భాగంగా విశాఖలో తొలి సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వహించేందుకు సిద్ధమైన బహిరంగ సభల్లో మొదటిదైన ఈ సభలో విపక్ష నేత జగన్ ప్రసంగించిన తీరుపై రాజకీయవర్గాల్లో ఇపుడు కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా జగన్ సభ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష వ్యాఖ్యలతో విమర్శించడం, ఇక త్వరలోనే తాను అధికారంలోకి […]
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్ష పోలింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచాన్ని వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ అధ్యక్ష బరిలో మాజీ మంత్రి, డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ పడుతున్నారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 8న మంగళవారం(నేడు) ఎన్నికలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం అవుతాయి. అయితే, అత్యంత ఆలస్యంగా లాస్ ఏంజెల్స్‌లో జరుగుతాయి. కాలమానం ప్రకారం అమెరికాలో […]
ఏపీ హోదాపై ప్రజా బ్యాలెట్‌లో షాకింగ్ రిజల్ట్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఇటు కాంగ్రెస్, అటు వైకాపాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధికార టీడీపీ సహా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు హోదా కన్నా ప్యాకేజీ ముద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో అసలు హోదా అనే మాట ఉండదని కూడా వెంకయ్య ఇప్పటకే స్పష్టం చేశారు. ఇక, ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. హోదా విషయంలో ప్రజలు […]
అమరావతిలో స్పీడ్ యాక్సెస్ కథేంటో తెలుసా
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో ఒకటిగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజధాని నిర్మాణం విషయంలో పక్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబడులు అవసరమవుతాయి. అయితే, ఈ పెట్టుబడులు రావాలంటే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబడుల వర్షం కురుస్తుంది. దీనిని గతంలోనే గుర్తించిన […]