ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవరిది ? అన్న అంశాలపై ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి అధికార టీడీపీకే పట్టం కడతారని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని స్పష్టమైంది. ఎన్నికలకు మరో […]
Category: Politics
ఆ వైకాపా ఎంపీ పదవి ఉంటుందా..ఊడుతుందా..!
నిజమే.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటున్నారు.. అరకు ఎంపీ కొత్తపల్లి గీత గురించి! ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతుండడమే దీనికికారణంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కులం, తర్వాత భూములు, ఇప్పుడు మళ్లీ కులం.. ఇలా ఊపిరాడనివ్వని వివాదాల్లో గీత కూరుకుపోతున్నారు. దీంతో అసలు ఆమె ఎంపీ పదవిలో ఉంటుందా? లేక మొత్తానికే ఎసరు వస్తుందా? అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె ఎంపీగానే ఉన్నా.. ఏ పార్టీ ఎంపీనా? అనేది […]
జనసేన ఓట్లు ఎవరికి..!
ఏపీలో త్వరలోనే రానున్న జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. తిరుపతి – కాకినాడ- విశాఖ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు మొత్తం 11 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికార టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేసమయంలో విపక్ష వైకాపా కూడా అమీతుమీ తేల్చుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను చర్చించుకుంటే.. ఏపీలో […]
ఏపీ మండలిలో 23 మంది కొత్త ఎమ్మెల్సీలు
ఏపీ శాసన మండలిలో దాదాపు 23 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండలి చైర్మన్ చక్రపాణి కూడా ఉండడం గమనార్హం. వీరంతా 2017 ఫిబ్రవరి, మార్చి నాటికి తమ పదవీ కాలాలను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్పటి నుంచే ముమ్మరంగా ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఒకదానికి మించి ఒకటి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాలని భావిస్తుండగా.. […]
మోడీ మరో చావు దెబ్బ…బడా బాబులు మటాష్
దేశంలోని నల్ల కుబేరులను ప్రధాని మోడీ ఇప్పట్లో వదిలి పెట్టేరా లేరా? ఇప్పటికే వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ.. మరింతగా ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతున్నారా? మరింత కఠిన చట్టాలు తేనున్నారా? రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది కేంద్రం నుంచి! తాజాగా పెద్ద నోట్ల రద్దు. బ్యాంకు విత్‌డ్రాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న మోడీ.. ఇంకా లైన్‌లోకి రాని నల్లకుబేరులపై మరింతగా […]
బాబుకు ఇంత అభద్రత ఎందుకో..!
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్నాయి. ఆయన చెంత 102 మంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, మిత్ర పక్షం బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకే మద్దతిస్తున్నారు. ఇక, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌తో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 2019 వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి […]
అమరావతిపై ప్రపంచ బ్యాంకుకు ఇన్ని డౌట్లా?!
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ఎఫర్ట్ పెడుతున్న రాజధాని నగరం అమరావతిపై ఇప్పుడు సర్వత్రా అనేక అనుమానాలు అలుముకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నగరంగా రాబోయే ముప్పైఏళ్లలో దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని అమరావతి గురించి బాబు చెబుతున్న మాటలు అంత నమ్మశక్యంగా లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి రుణాలు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వంటి పెద్ద సంస్థలు సైతం చంద్రబాబు మాటలను విశ్వసించడం లేదని ఇప్పుడు పెద్ద టాక్ నడుస్తోంది. అమరావతి అభివృద్ధికి సుమారు […]
వెంకయ్య గూట్లోకి జంప్ అయిన మంత్రి
రాజకీయాల్లో.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని కూనిరాగాలు తీస్తున్నారట బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు! ఇప్పుడు ఈయనకు అంత అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. సోము పెంచి పోషించిన నేత, ఆయనకు అనుచరుడిగా చెప్పుకొని డెవలప్ అయిన నేత మాణిక్యాలరావు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాలరావు దేవాదాయ మంత్రిగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన నడిచొచ్చిన దారినే మరిచిపోయారని అంటున్నారు సోము వీర్రాజు! […]
” బిగ్ బజార్ “ను బాబు సేవ్ చేశారా
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో జనాలు నానా తిప్పలు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడేవారు పెరిగిపోయారు. పెద్ద నోట్లు ఉండి కూడా ఏం చేయాలో తెలియక తిప్పలు పడుతున్నారు. అయితే, ఈ పెద్ద నోట్ల రద్దును కూడా కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నోట్ల రద్దు విషయం బాబుకు నెల రోజుల ముందే తెలిసిపోయిందని విపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే […]