కెసిఆర్,జగన్ లకు కేంద్రం ఝలక్ ..!

మంగళవారం (ఈరోజు) పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 చేయాలని, ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానమేంటని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో 2026లో జరిగే జనాభా […]

బండి స్పీడ్ కు గండి పడిందా.. గండి కొట్టారా..

జేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్  స్పీడ్ కు పార్టీలో కళ్లెమేశారా? కిషన్ వర్సెస్ సంజయ్ పోరులో కిషన్  రెడ్డే పైచేయి సాధించారా? బండి సంజయ్ ప్రారంభించే యాత్ర అందుకే వాయిదా పడిందా? అనే ప్రశ్నలు ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. కేసీఆర్ ను తిడుతూ మీడియాలో నానే రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇపుడు సైలెంట్ కావడంతోపాటు ఈనెల 9న చేపట్టనున్న పాదయాత్ర 24కు వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. పార్లమెంటు సమావేశాల కారణంగా యాత్ర వాయిదా […]

అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం […]

లక్ష్మీపార్వతి నోట ధర్మాన మాట..ఆ విషయం తెలిసే ఉంటుందేమో..?

ఏపీ తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి దాదాపుగా రాజకీయాలు మాట్లాడరు. సభలు, సమావేశాల్లో కూడా ఆమె విద్యా విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గం ఖాయమని చెప్పింది. ఇదే వేదికపై ధర్మాన కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్ చేశారు.  రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని […]

హుజూరాబాద్ కారు బెర్త్ ఎవరికో.. అధినేత మదిలో ఏముందో..?

రోజు రోజుకూ హుజూరాబాద్ ఉప ఎన్నికల చర్చ జోరందుకుంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎలాగైనా తమ వశం చేసుకోవాలని కేసీఆర్ శపథం పూనారు. పొరపాటున అక్కడ కారు వెనకబడిందో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే ఎన్నికల్లో విజయం సాధించడానికి కేసీఆర్ దళిత బంధు స్కీం ప్రకటించారు. ఈ పథకంపై ఎవరూ విమర్శించడం లేదు కానీ.. ఇదే స్పీడ్ లో రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే […]

కారును ఢీ కొట్టాలా? వద్దా..?  తెలంగాణ బీజేపీ నేతల్లో అనుమానాలు..

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ నాయకుల వాయిస్ పెరిగిపోయింది. ముఖ్యంగా టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ దూసకుపోతున్నాడు. నేరుగా సీఎం మీదనే బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెడుతున్నాడు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత చంచల్ గూడ జైలుకు పంపుతామని.. ప్రగతి భవన్ […]

కొత్త బాస్ కావాలి బాసూ..!  ఏపీలో పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఛాన్స్..?

ఆంధ్ర్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా అంటే.. ఉంది అంతే.. అంతకుమించి ఇంకేమీ చెప్పలేం. అందుకే పార్టీ అధిష్టానం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ద్రుష్టి సారించింది. తెలంగతాణ ఏర్పడ్డ తరువాత ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ జీరోకు పడిపోయింది. పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి నియమితులైన తరువాత పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. వయసు కారణంగా ఆయన స్థానికంగానే ఉండిపోయారు. ఆ తరువాత శైలజానాథ్ కు పార్టీ పగ్గాలు […]

కేసీఆర్ ప్లాన్ ఏంటో..  ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో?

హుజూరాబాద్ ఎన్నికలు జరిగేంతవరకు సీఎం, టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీర్ కాన్సట్రేషన్ మొత్తం అటే ఉంటుంది.. ఉంది కూడా. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హుజూరాబాద్ లో ఎన్నికలు జరిగితే అక్కడ కారు దూసుకు పోవాల్సిందే అనేది గులాబీ బాస్ భావన. అందుకే ఏం మాట్లాడిన హుజూరాబాద్ గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ కౌశిక్ బలమైన నాయకుడు కావడం వల్లే అతను నిరాశచెందకుండా పార్టీలోకి చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. ఈనెల […]

కేసీఆర్ మరో మైండ్ గేమ్.. తెలుగుదేశం పార్టీకి టెన్షన్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భవన్ ఓ వెలుగు వెలిగింది. నాయకుల రాకపోకలతో అక్కడ ఎప్పుడూ హంగామా ఉండేది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత అది ప్రాభవం కోల్పోయింది. నాయకులే కాదు.. అధినేత రావడం కూడా తగ్గిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా తగ్గించింది. ఇంకా చెప్పాలంటే టీడీపీ అసలు తెలంగాణలో పేరుకుమాత్రమే ఉందని చెప్పవచ్చు. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్. రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన తరువాత […]