ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]
Category: Politics
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..
ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]
ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!
ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]
మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ […]
ద్వితీయశ్రేణి కేడర్ లో అసంతృప్తి.. గుర్తించని గులాబీ బాస్..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నాం.. అయినా మాకు వచ్చిందేమీ లేదు.. మేము బాగుపడిందీ లేదు.. పార్టీ కోసం లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేశాం.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మా వంతు కష్టం మేం పడుతున్నాం.. పక్కనుంచి వచ్చేవాళ్లకే గుర్తింపుఉంది కానీ.. మాకెక్కడ అంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. అక్కడక్కడా ఈ అసంతృప్తి బహిర్గతమవుతున్నా అధినేత దృష్టికి ఈ విషయం వెళ్లడం […]
హుజూరాబాద్ ఓటర్లకు లేఖలు రాస్తున్న టీఆర్ఎస్ పార్టీ
’’గౌరవనీయులైన ఓటరు గారికి.. మేము చేపట్టిన సంక్షేమ పథకాలు చూడండి.. ఓటేయండి..‘ అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇపుడు లేఖలు రాయబోతోంది. ఓటర్లకు పార్టీలు ఎప్పుడైనా లేఖలు రాయడం విన్నారా.. ఓటర్లే పార్టీలు, నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడం చూశాం కానీ.. మొత్తం నియోజకవర్గ ఓటర్లందరికీ లేఖలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఎటు పోయి ఎటు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అరె.. ఉప ఎన్నికలకు ఇంత సీన్ […]
ఆంధ్రలో కొత్త కరోనా రూల్స్..?
కరోొనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ రాబోయే ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా రూల్స్ ను చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టక తప్పలేదు. ఏపీలో అయితే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీలో సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల […]
అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సంబంధించిన కొన్ని ఆడియోలు ఇటీవల కాల్ ఆలయంలో అదేపనిగా లీక్ అవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో కొన్ని సంభాషణలు జరిపినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ గా మారుతుంది. ఎక్కువగా ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలే కావాలనే వైరల్ చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీపార్వతి అనే ఆమెతో అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తించినట్లు ఒక ఆడియో టేప్ బయటకు […]
ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు […]