చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమేమో అన్నట్లుంది ఏపీలో రాజకీయ పరిస్థితులు.. అదేంటి లోకేష్ ను రాజకీయంగా జగన్ ఎందుకు పాపులర్ చేస్తాడనే అనుమానాలు వస్తాయి. కానీ.. ఆలోచిస్తే అదే జరుగుతోంది. ఎలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడిచేసినా నారా లోకేష్ వాలిపోతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ధైర్యం చెబతున్నాడు.. అదే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ చూసినా లోకేష్ వార్తల్లో ఉంటుండటంతో చెక్ పెట్టాలని జగన్ […]
Category: Politics
ఆ ఇద్దరూ సంతోషపడేలా జగన్ నిర్ణయం!
వైసీపీలో ఇద్దరు నాయకులు బాగా అసంత్రుప్తిగా ఉన్నారు. ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. ఈ విషయం సీఎం, పార్టీ చీఫ్ జగన్ కు కూడా తెలుసు. తనకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలని తమ్మినేని చాలా రోజులుగా అడుగుతున్నాడు.. సమయం ఇంకా రాలేదు కదా అని జగన్ అనుకుంటున్నాడు.. ఇక ధర్మాన ప్రసాదరావు అయితే.. తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నాడు. ఇంత సీనియర్ లీడర్ అయిన తనకు పార్టీలో […]
డబ్బులు పడ్డాయ్ సరే.. డ్రా చేయడం ఎలా?
నాలుగైదు రోజులుగా తమ అకౌంట్లలో దళిత బంధు డబ్బు పడటంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే వారికి నిరాశే ఎదురవుతోంది. డబ్బు తీసుకునేందుకు అవకాశం లేకుండా అకౌంట్ ఫ్రీజ్ లో ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ కు గురికావడం వారి వంతైంది. డబ్బు వచ్చింది కదా అని డ్రా చేసుకునేందుకు లేదని.. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి దానిని వాడుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పథకం ప్రకటించిన ఇన్ని రోజుల […]
డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!
మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]
సీబీఐ గడప తొక్కిన రేవంత్ రెడ్డి..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి కాస్త దూకుడు పెంచాడు. టీఆర్ఎస్, కేసీఆర్ పై రోజురోజుకూ విమర్శలు చేస్తూ పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచుతున్నారు. కోకాపేట భూముల వేలం వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఇదో పెద్ద కుంభకోణమని బహిరంగంగనే అనేక విమర్శలు చేశాడు రేవంత్ రెడ్డి. ప్రతి సభలోనూ, మీడియా సమావేశాల్లోనూ కోకాపేట వ్యవహారాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం ఆర్థికంగా లాభపడేందుకే ఈ వేలం వ్యవహారాన్ని […]
సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!
ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]
ఢిల్లీలో సారు ఏం చేస్తున్నారో..?
ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజులైంది.. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని వదలి.. ఈనెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు 1వ తేదీన కేసీఆర్ వెళ్లారు. ఆ వేడుక ముగిసిన అనంతరం ప్రధాని మోదీ అపాయింట్ కోసమని ఆగారు. మోదీని కలిశారు.. ఆ తరువాత పార్టీలో నెంబర్ 2 అయిన అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర పెద్దలను కలిశారు. వరుసగా బీజేపీ […]
సినిమా వాళ్లకు సినిమా చూపిస్తున్న జగన్..
అంతా మా ఇష్టం.. మా సినిమా.. మేము తీసిన బొమ్మ.. ఖర్చెక్కువైంది.. టికెట్ ధరలు పెంచుతాం.. మాక్కావాల్సిన వాళ్లకు టికెట్లు ఇస్తాం.. అనే రోజులు ఇక పోయాయి. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు చేస్తున్న నియంత్రుత్వానికి జగన్ చరమగీతం పాడారు. సినిమా రంగాన్ని మొత్తం తన చేతుల్లోకి అంటే ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నాడు. సినిమా మీరు రిలీజ్ చేయండి కానీ.. థియేటర్ టికెట్లు మాత్రం మేమే అమ్ముతాం.. ఆ తరువాత ఆ డబ్బు మీకిస్తాం అని తెలియజేసింది. […]
నాన్‌వెజ్ ప్రియులకు శుభవార్త..ఏపీలో రాబోతున్న మటన్ మార్ట్‌లు!?
నాన్‌వెజ్ ప్రియులకు ఇది శుభవార్తే. ఏపీలో మటన్ మార్ట్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ మటన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మటన్ మార్ట్‌గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఈ […]