మోదీ పిలిచారు..పొలిటిక‌ల్ రీఎంట్రీపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన మోహ‌న్‌బాబు?!

మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో క‌ష్టాలు ప‌డి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన మోహ‌న్ బాబు.. రెండు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్‌గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాత‌గానూ బోలెడ‌న్ని సినిమాల‌ను నిర్మించారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ […]

పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!

జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక […]

జగన్ గారూ.. చురుగ్గా స్పందించాల్సిందే!

అమ్మాయిల మానరక్షణ కోసం, దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టించడం కోసం ‘దిశ’ వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఆయన పార్టీకి చెందిన వారే.. అకృత్యాలకు పాల్పడితే ఏం చేయాలి? పార్టీ ఎలా స్పందించాలి? ఆరోపణలు వచ్చిన తక్షణమే స్పందించి, చర్యలు తీసుకుంటే తప్ప.. ఇతరత్రా దక్కుతున్న మంచిపేరును ప్రభుత్వం నిలబెట్టుకోవడం కష్టం. విశాఖ జిల్లా సీలేరులో ఒక దుర్మార్గం జరిగింది. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిన్న […]

పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]

నాన్న బాటలో.. పాదం కదపనున్న షర్మిల..

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. తాను ఆషామాషీగా పార్టీ పెట్టలేదని.. వైఎస్ షర్మిల రాష్ట్రప్రజలకు నిరూపించబోతున్నారు. జననేతగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జనం హృదయాల్లో గుర్తింపు ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే అడుగులు కదపనున్నారు. అచ్చంగా వైఎస్ తరహాలోనే షర్మిల కూడా చేవెళ్ల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించడానికి షెడ్యూలు కూడా ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత షర్మిల చురుగ్గా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ప్రతిమంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను చేస్తున్నారు. […]

సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?

ఆంధ్రప్రదేశ్లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు […]

విజయాన్ని ఏకపక్షంగా నిందిస్తే ఆత్మవంచనే..!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయభారాన్ని మూటగట్టుకుంది. సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఓడిపోయిన పార్టీ.. తమ ఓటమిని ప్రజల తీర్పుగా అంగీకరించడం జరగదు. గెలిచిన పార్టీ చేసిన అక్రమాలకు ఫలితంగా అభివర్ణిస్తుంది. మామూలు పరిస్థితుల్లోనే అలాంటి కాకమ్మ కబుర్ల చెప్పే పార్టీల నేతలు.. ఈసారి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో, మెజారిటీ ఏకగ్రీవాలు కావడం, చాలా చోట్ల తెలుగుదేశానికి పోటీకి దింపడానికి అభ్యర్థి కూడా లేకుండా పోయిన […]

మోదీ బ‌ర్త్‌డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ ప‌వ‌న్ స్పెష‌ల్ విషెస్‌!

భార‌త్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ‌ర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సోస‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు మోదీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ స్పెస‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ […]

ఆ ఎంపీ మహా పిరికి.. అయినా ఓవరాక్షన్ జాస్తి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. తనకు లక్షలాది మంది ప్రజల ఫాలోయింగ్ ఉన్నదని.. తాను పోస్టులు పెడితే లక్షలాది మంది ఎగబడి చూస్తుంటారని.. ఈ రాష్ట్రంలో తనకున్నంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మరే యితర నేతకూ లేదని చాలా తరచుగా చెప్పుకుంటూ విర్రవీగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆయనకున్న ఫాలోయింగ్ మొత్తం.. ముఖ్యమంత్రి జగన్ ను తీవ్రంగా ద్వేషించే.. తెలుగుదేశం పార్టీకి చెందిన అతివాదులు మాత్రమే అనే సంగతి ఆయనకు తెలిసినా ఒప్పుకోరు. పేరుకు […]