సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?

September 21, 2021 at 12:15 pm

ఆంధ్రప్రదేశ్లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు పడుతుంటాయి. అంతేకాకుండా వీటికి ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లను అమ్ముతుంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమా విడుదలైంది అంటే ఆ అభిమానులు ఎంత గోలగోలగా చేస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం.

అయితే ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా థియేటర్లు ఓపెన్ కాలేదు. దీంతో స్పెషల్ షోలసందడి లేకపోయింది. దీనికి తోడుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాకు స్పెషల్ షోలను క్యాన్సిల్ చేసింది.

అయితే తాత్కాలికమే అనుకున్న వారికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇకపై ఏపీలో బెనిఫిట్ షోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసినట్టు గా సమాచారం బయటకు వచ్చింది. అంతేకాకుండా టికెట్ ధరలు ఇతర సమస్యలపై, చర్చించేందుకుఆంధ్రప్ర‌దేశ్ మంత్రి పేర్ని నానితో స‌మావేశమైన ,సినీ పెద్ద‌ల్లో ఒక‌రైన సి.క‌ళ్యాణ్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.ఇక మీద ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు ఉండవని ఆయన క్లియర్ గా తేల్చిచెప్పేశాడు.

ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ లోనే ఉండే ప్రజలు ఎలా స్పందిస్తారు చూడాలి. ఇక తెలంగాణలో కూడా బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వలేదని సంగతి అందరికీ తెలిసిందే.

సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts