ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]
Category: Politics
ఫస్ట్ ఎటు పోదాం సామీ?
ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. […]
ఏం జరుగుతోందో నాకు తెలియాలి?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే అయినా సీనియర్ పొలిటీషియన్ల ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఊహించని డిసిషన్ తీసుకుంటాడు. అందుకే పార్టీని స్థాపించి.. అధికారాన్ని తెచ్చి.. ఒంటిచేత్తో నడుపుతున్నాడు. ఓ వైపు సీఎంగా ప్రభుత్వాన్ని.. మరో వైపు అధ్యక్షుడిగా పార్టీని విజయవంతంగా నడుపుతున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగుండదు అంతే.. ఎవరూ ఎదురు చెప్పలేరు. ఎవ్వరినీ ఓ పట్టాన నమ్మడు.. నమ్మితే వదలడు […]
కారులో ఇమడలేకపోతున్న డీఎస్!
ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]
టీడీపీలో బీసీ రాష్ట్ర నేత దాసరి శేషుకు ఇన్ని అవమానాలా…!
తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు తెలుగుదేశం అధికారంలోకి రావడంలో ఈ వర్గాలే కీలక పాత్ర పోషించాయి. అయితే పార్టీలో కొన్ని వర్గాల నేతల చర్యలతో బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలోనే వారు 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు చూశారు. అందుకే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే పార్టీ […]
వీకెండ్ అయితే మేలు గురూ..
శని, ఆదివారాలైతే మేలు.. ఆ రోజులు సెలవు రోజులు… కాస్త సమయముంటుంది.. ఎంజాయ్ చేయవచ్చు.. చాలా మంది ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలా భావిస్తారు. టూర్, పబ్, బార్.. ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకొని టైంపాస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా వీకెండ్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. అరె.. వారు కూడా వారాంతంలో ఎంజాయ్ చేస్తారా అని అనుకోవద్దు. వారు వీకెండ్ ను ప్లాన్ చేసుకునేది […]
బీజేపీతో తేడా కొట్టింది.. అందుకే ఉక్కు దీక్ష
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.. సినిమా పరంగా కాదు.. రాజకీయపరంగా.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు నడుపుతూ ముందుకుపోతున్న పొలిటికల్ పవర్ స్టార్ ఉన్నట్టుండి ఉక్కు దీక్ష ప్రకటించాడు. విశాఖలోని వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. వారికి జనసేనాని మద్దతుగా నిలిచాడు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఈయనకు బీజేపీతో వ్యవహారం ఎక్కడో చెడింది.. అందుకే కమలం […]
వంశీ సారీతో టీడీపీలో షాక్
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అది గౌరవసభ కాదు.. కౌరవ సభ.. నా భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు నాయుడు రోదించారు. నేను ఆ సభకు వెళ్లను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అని శపథం చేసి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే వంశీ తదితరులు తన కుటుంబంపై, తన భార్యపై అవమానకరంగా మాట్లాడారు అని బాబు ఆరోపించారు. ఆ రెండు రోజులు […]
ఖమ్మం కాంగ్రెస్ లో వార్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం ప్రత్యేకం.. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ జిల్లాలో మంచి ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి బట్టకడుతోందంటే ఖమ్మం జిల్లా వల్లే అని చెప్పవచ్చు. అయితే ఇపుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ రెండు గ్రూపులు పోటీ పడుతుండంతో కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు […]